నిఖిల్ అప్ కమింగ్ మూవీ కిరాక్ పార్టీకి ఎట్టకేలకు దారి దొరికింది. మార్చి 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. లెక్కప్రకారం ఈ మూవీ ఈపాటికి విడుదల కావాలి. కానీ థియేటర్ల సమస్య వెంటాడింది. ప్రతివారం ఏదో ఒక హీరోతో పోటీ ఎదురైంది. అందుకే సినిమాను వాయిదా వేశారు.
అటు నిఖిల్ మాత్రం ఆ విషయాన్ని భలేగా కవర్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాలేదని, రీ-రికార్డింగ్ లో కొత్త టెక్నిక్స్ వాడుతున్నామని అందుకే విడుదల ఆలస్యమైందంటూ గతంలో ట్వీట్ చేశాడు. నిజానికి కేశవ ఎఫెక్ట్ తో సోలో రిలీజ్ కోసం ట్రై చేస్తున్నాడు నిఖిల్. మరో హీరోతో పోటీపడే కంటే కాంపిటేషన్ లేని టైమ్ లో, ఎక్కువ థియేటర్లతో రావాలనేది నిఖిల్ ప్లాన్.
ప్రస్తుతం ప్రకటించిన మార్చి 22వ తేదీని పొరపాటున మిస్ అయితే మాత్రం నిఖిల్ కష్టాలు డబుల్ అవుతాయి. ఎందుకంటే ఆ తర్వాత రంగస్థలం లాంటి పెద్ద సినిమా వస్తోంది. ఆ వెంటనే కొన్నివారాల గ్యాప్ లో భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాలు వస్తాయి. మధ్యలో రజనీకాంత్ నటించిన కాలా కూడా ఉంది. సో.. అప్పుడు నిఖిల్ అనుకుంటున్న సోలో రిలీజ్ సాధ్యంకాకపోవచ్చు. సో.. ఈసారి కాస్త గట్టిగా అగ్రిమెంట్లు కుదుర్చుకొని దిగితే బెటర్.