“నాకు నచ్చినట్టు తీస్తా.. నచ్చితే చూడండి.” దర్శకుడు వర్మ తరచుగా చెప్పే డైలాగ్ ఇది. అయితే పోలీసుల ముందు కూడా ఈ దర్శకుడు ఇలానే వ్యవహరించినట్టున్నాడు. ప్రస్తుతం జీఎస్టీ కేసు వర్మ మెడకు కాస్త గట్టిగానే చుట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అడల్ట్ మూవీగా జీఎస్టీ (గాడ్-సెక్స్-ట్రూత్) తీశాడు వర్మ. ఈ సందర్భంగా తనకుతాను చేసుకున్న ప్రమోషన్ లో ఓ మహిళా సంఘానికి చెందిన నేతపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. దీనిపై నమోదైన కేసుకు సంబంధించి వర్మను పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
అయితే విచారణలో భాగంగా తప్పుడు సమాచారం అందించినట్టు పోలీసులు భావిస్తున్నారు. జీఎస్టీ షార్ట్ ఫిలింను స్కైప్ ద్వారా తీసినట్టు పోలీసులకు చెప్పాడట వర్మ. అదే కనుక నిజమైతే వర్కింగ్ స్టిల్స్ ఎలా వచ్చాయనేది ప్రశ్న.
ఒకవేళ తను తప్పు చెప్పానని, జీఎస్టీని ఇండియాలోనే తీశానని వర్మ ఒప్పుకుంటే మళ్లీ అదొక కేసు. ఎందుకంటే నిబంధనల ప్రకారం భారత గడ్డపై ఓ అడల్ట్ కంటెంట్ సినిమాను తీయకూడదు.
సో.. ఎలా చూసుకున్నా ఆర్జీవీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. దీనికి తోడు ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఇష్టమొచ్చినట్టు పెట్టిన పోస్టులు, ట్వీటులు కూడా అతడి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది.
మరీ ముఖ్యంగా పోర్న్ ఇష్టమా, పవన్ ఇష్టమా అంటూ ట్విట్టర్ లో వర్మ పెట్టిన సర్వేపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వీటితో పాటు వర్మ నుంచి స్వాధీనం చేసుకున్న లాప్ ట్యాప్ ను విశ్లేషించే పనిలో కూడా పడ్డారు.