వాళ్ల ఆశలపై నీళ్లు చల్లిందెవరు?

సినిమా ఎప్పుడు విడుదల చేసుకోవాలన్నది నిర్మాత అభిమతం. బయ్యర్ల వీలు చూసుకుని సినిమాను వదుల్తారు. కానీ చిత్రంగా 9న విడుదల చేయాలని వున్నా చేయలేకపోతున్నారు వరుణ్ తేజ తొలి ప్రేమ సినిమాను. మెగా హీరోలు…

సినిమా ఎప్పుడు విడుదల చేసుకోవాలన్నది నిర్మాత అభిమతం. బయ్యర్ల వీలు చూసుకుని సినిమాను వదుల్తారు. కానీ చిత్రంగా 9న విడుదల చేయాలని వున్నా చేయలేకపోతున్నారు వరుణ్ తేజ తొలి ప్రేమ సినిమాను. మెగా హీరోలు ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలకు పోటీ పడ్డాయి.

తొలిప్రేమను వాలంటైన్స్ డే వీక్ లో విడుదల చేయాలని తొమ్మిది డేట్ గా అనుకున్నారు. కానీ ఇంటిలిజెంట్ సినిమా వచ్చిపడింది. దీంతో బలవంతంగా తొలిప్రేమను వెనక్కు పంపారు. ఎవరు పంపారు అన్నది పరమ రహస్యంగా వుండిపోయింది. ముందుకు వద్దాం అంటే నిర్మాతకు 'అష్టమి' సెంటిమెంట్ అడ్డం వచ్చింది.

దీంతో వెనక్కు వెళ్లారు. దీనివల్ల సోలో ఓపెనింగ్స్ వుండవు. కానీ ఇంతలో కనీసం శుక్రవారం సాయంత్రం ఫస్ట్ షోతో విడుదల చేద్దామని నిర్మాత ఆలోచన చేసారు. అప్పటికి రెండు షోలు అయిపోతాయి.

అందువల్ల పోటీ పాయింట్ రాదన్నది నిర్మాత ఆలోచన. ఆ మేరకు మళ్లీ నిర్మాత ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సమాలోచనలు చేసారు. ఓ దశలో అదే ఫిక్సయ్యారు. ఎందుకంటే ఈసినిమా 17నుంచి 18కోట్లకు ఓవరాల్ గా కొనుగోలు చేసింది దిల్ రాజు. ఆయనకు ఆ మాత్రం జాగ్రత్త అవసరం కనుక.

కానీ ఇప్పుడు మళ్లీ అలా వద్దని, 10నే విడుదల చేయమని నిర్మాతపై వత్తిడి వస్తు్నట్లు వినికిడి. దిల్ రాజుకు ఇష్టమైనది, నిర్మాత ప్రసాద్ కు ఇష్టమైంది. మరి ఎందుకు శుక్రవారం ఫస్ట్ షోతో విడుదల చేయడం కుదరడం లేదు. దీని వెనుక కనపడని, వెల్లడించిన వత్తిడి వున్నట్లు తెలుస్తోంది.

ఈ వత్తిడి ఫలితం తొలిప్రేమ ఓపెనింగ్స్ పై కాస్త గట్టి ప్రభావమే చూపిస్తుందని తెలుస్తోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇలా పెరుగుతూ వుంటే, పోటీ తప్పదు. నిర్మాతలకు ఇబ్బందులూ తప్పవేమో?