నా పేరు సూర్య. అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న లేటెస్ట్ సెన్సేషన్. ఈ సినిమా మార్కెటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా ఏరియాలు అమ్మేసారు కూడ. ఉత్తరాంధ్ర ఏరియాను ఏడున్నర కోట్ల రేంజ్ లో అమ్మేసినట్లు తెలుస్తోంది.
అయితే నైజాం మార్కెట్ పెద్దది. పైగా బన్నీకి మంచి హోప్ వున్న ఏరియా అది. అందుకే ఇక్కడ మాత్రం నిర్మాత లగడపాటి శ్రీధర్ కాస్త భారీ రేట్ కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పడం 25కోట్ల వరకు చెబుతున్నారు. అయితే అంత పలకడం అంటే అద్భుతం అనుకోవాలి. 20వరకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
విశాఖ కొన్న బయ్యర్లే, నైజాంలో కొంతమందితో కలిసి కొనే ఆలోచనలో ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క, అనుకున్న రేటు రాకపోతే ఆసియన్ సునీల్ ద్వారా స్వంతంగా చేసుకుందామన్న ఆలోచన కూడా నిర్మాతకు వున్నట్లు తెలుస్తోంది.
నిజానికి బన్నీ సూపర్ హిట్ సినిమా సరైనోడు నైజాంలో 20కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. రేసుగుర్రం 18కోట్ల వరకే వచ్చింది. అందువల్ల నా పేరు సూర్యకు పాతికకోట్లు అంటే లగడపాటి చాలా ఎక్కువ ఆశిస్తున్నారని అనుకోవాలేమో?
అజ్ఞాతవాసి ముందు అయితే ఎవరైనా తెగించి ధైర్యం చేసేవారేమో? కానీ ఇప్పుడు ఆ సినిమా ఫలితం వల్ల కనీసం 10పర్సంట్ రేట్లు డౌన్ అయివుంటాయి, సమ్మర్ లో వచ్చే సినిమాలకు.