వెంకీ సినిమాలను వెయ్యి కళ్లతో కనిపెట్టి వుంటారు దగ్గుబాటి సురేష్ బాబు. వెంకీ కోసం తయారుచేసిన ఏ కథ అయినా ఆయనను దాటుకుని, క్వాలిటీ సర్టిఫికెట్ ముద్ర వేయించుకుని వెళ్లాల్సిందే.
అక్కడ నో అంటే ఇక వెంకీ విననే వినడు. ఈవారం విడుదలయిన టచ్ చేసి చూడు కథ ముందుగా వెంకీ దగ్గరకే వెళ్లినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కథను వినగానే సురేష్ బాబు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఘర్షణలో పోలీస్ ఆఫీసర్ గా, చాలా సినిమాలో ఫ్యామిలీ పర్సన్ గా వెంకీ చేసారు. అందువల్ల ఆ రెండు షేడ్ లు వున్న ఆ కథ వెంకీకి పక్కాగా సూట్ అవుతుందని దర్శకుడు భావించినట్లు తెలుస్తోంది.
ఒక విధంగా దర్శకుడు కూడా కరెక్టేనేమో? కథ పాతదే అయినా వెంకీ చేసి వుంటే, ట్రీట్ మెంట్ వేరుగా వుండేది. మరీ అల్లరి ఎక్కువ కాకుండా వుంటుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్ లో కాస్త నార్మల్ రేంజ్ లో వుంటాయి. అప్పుడు సినిమా కాస్త బెటర్ గా వచ్చి వుండేదేమో? కానీ కథ మరీ పాతది అని సురేష్ బాబు నో చెప్పివుంటారు.
అప్పుడు ఈ కథ రవితేజ దగ్గరకు రావడం అయన ఓకె చేయడం, ఆయన స్టయిల్ లో ట్రీట్ మెంట్ తయారుచేయించడం చకచకా జరిగిపోయింది. అన్నీ చేసినా కథలో వున్న మైనస్ కావచ్చు, మేకింగ్ లో మైనస్ కావచ్చు మొత్తం మీదా పాజిటివ్ రిజల్ట్ సాధించలేకపోయిది.