తొలిప్రేమ-మలి ట్రయిలర్

తొలి ప్రేమ అంటూ వరుణ్ తేజ ఈ నెల 10న జనం ముందుకు వస్తున్నాడు. అంతకన్నా ముందుగా ట్రయిలర్ ఇవ్వాళ రావాల్సి వుంది. ఈ ఉదయం 11గంటలకు ట్రయిలర్ విడుదల ప్లాన్ చేసారు. కానీ…

తొలి ప్రేమ అంటూ వరుణ్ తేజ ఈ నెల 10న జనం ముందుకు వస్తున్నాడు. అంతకన్నా ముందుగా ట్రయిలర్ ఇవ్వాళ రావాల్సి వుంది. ఈ ఉదయం 11గంటలకు ట్రయిలర్ విడుదల ప్లాన్ చేసారు. కానీ సడెన్ గా వాయిదా వేసారు. టెక్నికల్ ఇస్యూ వచ్చిందని, సాయంత్రం విడుదల చేస్తామని యూనిట్ నుంచి సమాచారం వచ్చింది. సాయంత్రం అవుతున్నా ట్రయిలర్ జాడ లేదు. కారణం ఏమిటంటే, ఆర్ ఆర్ ఇంకా జరుగుతోంది అంటున్నారు. 

ట్రయిలర్ విడుదల డేట్ ముందుగా ప్రకటించి, వాయిదా వేసి, కొత్తగా ఆర్ ఆర్ చేయడం ఏమిటో? దీనిపైనే ఇండస్ట్రీలో ఆసక్తికర గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలిప్రేమ కోసం కట్ చేసిన ట్రయిలర్ ను స్క్రాప్ లో పడేసి, కొత్తగా ట్రయిలర్ చేస్తున్నారట. ఈ పని గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు. అందువల్ల వచ్చిన సమస్య ఇది.

తొలిప్రేమ దర్శకుడు వెంకీ, నిర్మాత భోగవిల్లి ప్రసాద్ చెన్నయ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనిలో వున్నారు. దాంతో ఇక్కడ ఎవరు కట్ చేసారో కానీ, ట్రయిలర్ కట్ చేసాం అనిపించారు. కానీ అది ఎవ్వరికీ నచ్చలేదని తెలుస్తోంది. దిల్ రాజు, భోగవిల్లిప్రసాద్, వరుణ్ తేజ ఇలా ఎవ్వరికీ ఆ ట్రయిలర్ నచ్చలేదని సమాచారం. నిన్న ప్రెస్ మీట్ కోసం చెన్నయ్ నుంచి వచ్చిన నిర్మాత, మిగిలన వారు కలిసి ట్రయిలర్ చూసి, యునానిమస్ గా మార్చి కొత్తది చేయించాలని డిసైడ్ అయ్యారు.

దాంతో మళ్లీ మొదటికి వచ్చింది ట్రయిలర్ కథ. ముక్కోణపు పోటీలో విడుదలవుతున్న తొలిప్రేమ మీద మాంచి బజ్ వుంది. అలాంటి సినిమాకు ట్రయిలర్ పెర్ ఫెక్ట్ లేకుంటే ఇబ్బంది వస్తుంది. అందుకే మళ్లీ పకడ్బందీగా ఓ ట్రయిలర్ కటింగ్ స్పెషలిస్ట్ చేత కట్ చేయిస్తున్నారు.