ఒకసారి ఒక ఐడియా సక్సెస్ అయిన తరువాత పని సులువు అయిపోతుంది. రాజగారి గది సినిమా హిట్ అన్నది ఓ అదృష్టం అనే చెప్పాలి. ఆ తరువాత చాలా జాగ్రత్తలు పడి, మళయాల సినిమా కొని, నాగ్, సమంత లాంటి కాంబినేషన్ సెట్ చేసుకుని, రాజగారి గది 2 సినిమా అందించాడు.
మొత్తానికి సక్సెస్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ మరోసారి అదే ట్రంప్ కార్డు వాడాలని అనుకుంటున్నాడు దర్శకుడు ఓంకార్.
రాజగారి గది అనే దాన్ని జస్ట్ బ్రాండింగ్ గా వాడుకుని మళ్లీ మరో మాంచి కథ సెట్ చేసుకుని మూడు నెంబర్ జోడించి సినిమా చేసే పనిలో పడ్డాడట ఓంకార్. రాజుగారి గది 2 సినిమా అందించిన పివిపి నే మూడో నెంబర్ కు కూడా నిర్మాతగా వ్యవహరిస్తారు.
అయితే ఈ ప్రాజెక్టుకు కొంచెం టైమ్ పడుతుంది. అంతకన్నా ముందుగా ఫుట్ బాల్ ప్లేయర్ బ్యాక్ డ్రాప్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేసే పనిలో వున్నాడు ఓంకార్.
ఆ సినిమాకు నిర్మాత సెట్ అయ్యే స్టేజ్ నడుస్తోంది. అది ఓకె అయితే ఓ ఆర్నెల్ల పాటు ఆ ప్రాజెక్టు మీద వుండి, అది అయిన తరువాత ఈ పార్టీ 3 పని మొదలుపెడతాడు. అయితే షరామామూలుగా రాజుగారి గది 2 మాదిరిగానే ఈ పార్టీ 3కి కూడా ఫస్ట్ పార్ట్ తో ఏ అవినాభావ సంబంధం వుండదు.