కిర్రాక్.. ప్రచారం చేయాల్సిందే

గట్టిగా ఇరవై రోజులు దూరంలో లేవు ఆ రెండు సినిమాలు. ఒకటి కిర్రాక్ పార్టీ. రెండవది ఇంటిలిజెంట్. అదే రోజు మరో రెండు సినిమాలు వున్నాయి. వరుణ్ తేజ తొలిప్రేమ, సీనియర్ హీరో మోహన్…

గట్టిగా ఇరవై రోజులు దూరంలో లేవు ఆ రెండు సినిమాలు. ఒకటి కిర్రాక్ పార్టీ. రెండవది ఇంటిలిజెంట్. అదే రోజు మరో రెండు సినిమాలు వున్నాయి. వరుణ్ తేజ తొలిప్రేమ, సీనియర్ హీరో మోహన్ బాబు గాయత్రి. ఈ రెండిటి సినిమాలకు ప్రచారం ఓపెన్ అయిపోయింది. గాయత్రి టీజర్ బయటకు వచ్చింది. ఆసక్తి రేకెత్తించే దిశగా వెళ్తోంది. మరోపక్క వరుణ్ తేజ తొలిప్రేమ సినిమాకు ఆడియో ఫంక్షన్ కూడా జరిగిపోయింది.

నిఖిల్ కిర్రాక్ పార్టీకి సంబంధించి చిన్న బైట్ మాత్రం బయటకు వచ్చింది. టీజర్ ఇంకా రావాలి. 25 తరువాత అంటున్నారు. టీజర్ 25 తరువాత అంటే ట్రయిలర్, ఇతరత్రా ప్రచారాలు ఎప్పుడో? కిర్రాక్ పార్టీ యూనిట్ ట్విట్టర్, ముంబాయి క్రిటిక్ ల ట్వీట్ లు వుంటే చాలు ప్రచారం అయిపోతుంది అనుకుంటోందేమో? ముంబాయి క్రిటిక్ ను తెచ్చి మరీ లై సినిమా ఫంక్షన్ లో పెద్ద పీట వేసారు. ఏం ఒరిగింది? గ్రౌండ్ లెవెల్లో ప్రచారం వుండాలి తప్ప, ట్విట్టర్ లో కాదు.

ఇక సాయిధరమ్ తేజ- వివి వినాయక్ సినిమా సంగతి మరీనూ. సినిమా డేట్ ఇచ్చారు తప్ప. ఓ లుక్ లేదు. టీజర్ లేదు. సాంగ్ లేదు. మరే వైనమూలేదు. మరి తొమ్మిదిన టఫ్ కాంపిటీషన్ వున్నపుడు, ప్రచారంలో కూడా ఆ కాంపిటీషన్ వుండాలి కదా? ఇంటిలిజెంట్ కు ఆ వైనం పట్టినట్లు లేదు. ఆ ప్రొడక్షన్ టీమ్ అంతా ఇంకా జై సింహా ప్రమోషన్ హడావుడిలోనే వుంది. మరి ఇంటిలిజెంట్ మీదకు ఎప్పుడు వస్తుందో?

9న టఫ్ కాంపిటీషన్ వుంది. నాలుగు కాస్త క్యూరియాసిటీ వున్న సినిమాలు అంటే చాలా కేర్ ఫుల్ గా వుండాలి. ప్రచారం కూడా ఆ రేంజ్ లో వుండాలి. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో?