అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. అలాగా వుంది. అదిగో కాలేజీలో షూటింగ్ అంటే, అయితే ఇదిగో హీరో స్టూడెంట్ అంటున్నారు. అందుకే షూటింగ్ గ్యాప్ లో అలాంటి వార్తలు చదివి, భలే ఫన్ జనరేట్ అయిందట షూటింగ్ స్పాట్ లో. ఇదంతా మారుతి సినిమా సంగతే. ఈ సినిమాలో నాగ చైతన్య-అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లు. ఈ సినిమా షూటింగ్ నిన్నటికి నిన్న కోఠీ కాలెజీలో స్టార్ట్ అయింది.
కోఠీ కాలేజీలో షూట్ స్టార్ట్ అయింది కాబట్టి, హీరో హీరోయిన్లు స్టూడెంట్లు. వాళ్ల మధ్య ప్రేమ, ఇతరత్రా వ్యవహారాలు అంటూ కథ అల్లేసారు. వార్తలు వచ్చేసాయి. నిజానికి కాలేజీ కోసం అని కోఠీ కాలేజీలో షూట్ స్టార్ట్ చేయలేదు.
మారుతి స్టయిల్ ఎలా వుంటుందీ అంటే దొరికిన లొకేషన్ ను ఏదో విధంగా వాడేసి, నిర్మాతకు ఓ రూపాయి మిగిల్చే విధంగా వుంటుంది. సినిమాలో వేరే సీన్ల కోసం కాలేజీని తీసుకున్నారట. అంతే కానీ ఈ సినిమాలో చైతన్య స్టూడెంట్ ఏమీ కాదట. అసలు చైతన్య ప్రొఫెషన్ తో కూడా కథకు పెద్ద లింక్ ఏమీ వుండదట. ఓ కుర్రాడు. ఏదో ఉద్యోగం చేస్తుంటాడు అంతే.
మిగిలిన వ్యవహారం అంతా వేరట. కానీ కాలేజీ లో షూట్ అంటే ఇలా స్టూడెంట్ ను చేసేసారని సరదాగా ఫన్ పుట్టిందట షూటింగ్ స్పాట్ లో.