ఆరంభంలో ఫ్లాపులు తీసినా, రాజుగారి గది సినిమాతో కాస్త పేరు వచ్చింది దర్శకుడు ఓంకార్ కు. ఆ తరువాత అదే టైటిల్ క్రేజ్, నాగార్జున, సమంత లాంటి పెద్ద పేర్లు, పివిపి లాంటి పెద్ద బ్యానర్ ను వాడడంతో రాజుగారి గది 2 కూడా ప్రాఫిటబుల్ వెంచరే అయింది. అయినా మరో సినిమా ఏదీ చేతిలోకి రాలేదు. వాలీ బాల్ ప్లేయర్ బ్యాక్ డ్రాప్ లో కథ పట్టుకుని, ఆఖరికి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఒప్పించగలిగారు.
కానీ నిర్మాత కావాలి కదా? ఎవరు? ఎవరు? ఎవరు? ఆఖరికి దోరికేసారు. గతంలో రవితేజతో బెంగాల్ టైగర్ తీసి, ఇప్పుడు గోపీచంద్ తో శపధం తీస్తున్న సత్యసాయి ఆర్ట్స్ కేకే రాధామోహన్ సూత్ర ప్రాయంగా నిర్మాతగా ఓకె అయినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్-ఓంకార్ కాంబోలో సినిమాకు ఓకె అన్నారని తెలుస్తోంది. అయ తే రెమ్యూనిరేషన్లు, నిర్మాణంలో వాటాలు ఇలాంటి వాటి దగ్గర డిస్కషన్లు సాగుతున్నాయి.
రాజుగారి గది 2కి కూడా ఓంకార్ రెమ్యూనిరేషన్ కాకుండా, ప్రాఫిట్ లో షేర్ తీసుకున్నారు. ఈ సినిమాకు కూడా ఇటు హీరో, అటు డైరక్టర్ ఇద్దరూ ఫ్రాఫిట్ షేరింగ్ మీద చేసే దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి.