భాగమతి ప్రాఫిటబుల్ వెంచరేనా?

అనుష్క హీరోయిన్. హర్రర్ థ్రిల్లర్ జోనర్. యువి బ్యానర్. ఇవి మాత్రమే భాగమతి సినిమాకు బజ్ తేవాల్సిన పాయింట్లు. ఎంతో వుంటే తప్ప, జనాలు థియేటర్లకు రాని టైమ్ లో కేవలం సబ్జెక్ట్ ను…

అనుష్క హీరోయిన్. హర్రర్ థ్రిల్లర్ జోనర్. యువి బ్యానర్. ఇవి మాత్రమే భాగమతి సినిమాకు బజ్ తేవాల్సిన పాయింట్లు. ఎంతో వుంటే తప్ప, జనాలు థియేటర్లకు రాని టైమ్ లో కేవలం సబ్జెక్ట్ ను నమ్మి, గ్రాండియర్ కు బోలెడు ఖర్చు చేసారు. సుమారు ముఫై నుంచి ముఫై అయిదు కోట్లు ఖర్చయింది భాగమతి సినిమాకు. మరి సేఫ్ ప్రాజెక్ట్ నే అనుకోవాలా?

అలా అంటే, సేఫ్ నే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎందుకంటే ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ ద్వారా 11 కోట్ల వరకు రికవరీ జరిగినట్లు తెలుస్తోంది. తమిళ, మళయాల వెర్షన్ లను సేల్ చేసేసారు.

ఆరంభంలో రిలీజ్ మాత్రమే అని అనుకున్నారు కానీ, తరువాత తరువాత స్టూడియో గ్రీన్ తో బేరం సెటిల్ అయి, అమ్మకం సెట్ అయిపోయింది. తమిళ, మళయాల అమ్మకాల ద్వారా 10 దాకా వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఇంక మరో పదిహేను దాకా రికవరీ కావాలి. అది తెలుగు ద్వారానే జరగాలి. యువి సంస్థ తెలుగులో నేరుగా తానే విడుదల చేస్తోంది. పెద్దగా కాంపిటీషన్ లేదు. మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర, భాగమతి మాత్రమే విడుదలవుతున్నాయి 26న. మార్కెట్ లో సరైన సినిమా లేదు. అందువల్ల ఏమాత్రం జనాలను ఆకట్టుకున్నా, ఫస్ట్ వీక్ లో కాకున్నా, సెకెండ్ వీక్ లో రికవరీ జరిగిపోయే అవకాశం వుంది.