స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని చిరంజీవి రెండు దశాబ్ధాలకి పైగా ఏలాడు. చిరంజీవి తర్వాత ఆ స్థానం చేతులు మారుతూ వచ్చింది. అగ్ర హీరోలైన పవన్, మహేష్, ఎన్టీఆర్ నిలకడ చూపించలేకపోవడంతో చిరంజీవి తర్వాత ఇతడే నంబర్ వన్ అని చెప్పడానికి వీల్లేకుండా పోయింది.
రీసెంట్ టైమ్స్‌లో ఎన్టీఆర్‌ని చూస్తోంటే నంబర్‌వన్ అవడానికి అన్ని అవకాశాలు వున్నట్టు కనిపిస్తోంది. సినిమాల పరంగా సరైన మార్గంలో వెళుతూ, క్లాస్‌ని, మాస్‌ని అలరిస్తోన్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలోను నటుడిగా ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ కూడా తీసుకుంటున్నాడు. మాస్లో ఎప్పటినుంచో బలమైన ఫాలోయింగ్ వున్న ఎన్టీఆర్ నైజాం, ఓవర్సీస్లో కూడా ఒక శక్తిగా ఎదిగాడు.
ఒక డిజాస్టర్ ఇచ్చిన బాబీలాంటి దర్శకుడితో సినిమా చేస్తూ కూడా 'జై లవకుశ'కి రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడానికి ఎన్టీఆర్ కారణమయ్యాడు. బుల్లితెరపై బిగ్‌బాస్‌గా తెలుగు సినిమా చరిత్రలో ఏ నటుడు అందుకోని స్వాగతాన్ని అందుకున్నాడు. టాప్ డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అయివుండడంతో రానున్న రోజుల్లో ఎన్టీఆర్‌ని ఆపడం ఎవరి తరం కాదు. అందరూ అనుకుంటున్నట్టు రాజమౌళితో చిత్రం ఖరారైతే ఇక అతడిని అందుకోవడం మిగతా వారి వల్ల కాదు.
నెక్స్ట్ నంబర్‌వన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ వున్నాయనే పోల్స్‌లో కూడా ఎన్టీఆర్ విన్ అవుతున్నాడు. నిజానికి సింహాద్రి టైమ్‌లోనే సింహాసనం చేజిక్కించుకోవాల్సిన వాడు కాస్తా రాంగ్ ట్రాక్ పట్టి మిస్ చేసుకున్నాడు. తర్వాత స్టయిల్ మార్చి తన టాలెంట్‌తో ఎలాంటి పాత్రలకైనా న్యాయం చేస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.