ఓ మహిళగా తన హక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కింది చార్మి. సాయంత్రం 5 గంటల లోపే విచారణ ముగిసేలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. తన అనుమతి లేకుండా బ్లడ్ శాంపిల్స్, కేశాలు తీసుకోకూడదనే రూల్ ను కోర్టు ద్వారా మరోసారి గట్టిగా వినిపించింది. మరి ఇప్పుడు ముమైత్ పరిస్థితేంటి..? ఆమె కూడా మహిళే కదా.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదంలో మరికాసేపట్లో సిట్ ముందు హాజరుకానుంది ముమైత్ ఖాన్. అధికారులు చార్మిని ట్రీట్ చేసినట్టే ముమైత్ ను కూడా ట్రీట్ చేసి 5లోపు పంపించేస్తారా లేక మరింత సమయం సిట్ ఆఫీసులోనే కూర్చోబెడతారా? పూరి జగన్నాథ్, సుబ్బరాజు నుంచి శాంపిల్స్ తీసుకున్నట్టు ముమైత్ నుంచి కూడా నమూనాలు సేకరిస్తారా లేక చార్మిని వదిలేసినట్టు విడిచిపెడతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు.
అయితే ఒకటి మాత్రం నిజం. ముమైత్ ఇంటరాగేషన్ వాడివేడిగా జరగబోతోందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ముమైత్ ను ప్రశ్నించడానికి ముందు రోజే మైక్ కమింగ అనే నెదర్లాండ్ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. ఆ సమాచారం ఆధారంగా ఈరోజు ముమైత్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.
సిట్ విచారణ కోసం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఒకరోజు అనుమతితో బయటకు రాబోతోంది ముమైత్. ఈరోజు ఇంటరాగేషన్ పూర్తయిన వెంటనే తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిపోతుంది. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. కమింగ అరెస్టు, ముమైత్ విచారణతో ఈ కేసు కొత్త మలుపు తిరుగబోతోందట.