బాలయ్యతో బోణీ ‘స్టంపర్’

సినిమాలకు ఒకప్పుడు ట్రైలర్లు మాత్రమే వుండేవి. ఆ తరువాత టీజర్లు, పస్ట్ లుక్ ఇలా చాలా వచ్చాయి. అయితే ఈ వరుసలో మరో కొత్త పేరు వచ్చి చేరుతోంది. బాలయ్య-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో…

సినిమాలకు ఒకప్పుడు ట్రైలర్లు మాత్రమే వుండేవి. ఆ తరువాత టీజర్లు, పస్ట్ లుక్ ఇలా చాలా వచ్చాయి. అయితే ఈ వరుసలో మరో కొత్త పేరు వచ్చి చేరుతోంది. బాలయ్య-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న పైసా వసూల్ సినిమా కోసం ఓ కొత్త ప్రచార అస్త్రం బయటకు తీసారు. దానికి స్టంపర్ అని పేరు పెట్టారు. 

స్టంపర్ అంటే మరేమీ కాదు. టీజర్ కు ఎక్కువ, ట్రైలర్ కు తక్కువ అన్నట్లు మధ్యస్థంగా వుంటుంది అన్నమాట. టీజర్లు ప్రారంభమైనపుడు జస్ట్ మిర్చిగింజలా చురుక్కుమనేలా చిన్నవిగా వుండేవి. తరువాత వాటి నిడికి మెల్లగా కాస్త పెరిగింది. అందుకు బదులుగా ఫస్ట్ లుక్ అనేవి వచ్చి చేరాయి. ఇప్పుడు అవే టీజర్ నిడివిని మరి కొంచెం పెంచి పైసా వసూల్ కోసం స్టంపర్ తయారు చేసారు. పైసా వసూల్ స్టంపర్ నిడివి ఒక నిమిషం కన్నా కాసిన్ని సెకెండ్ లు ఎక్కువ వుండే అవకాశం వుంది. ఇది ఈ నెల 28న విడుదల చేస్తారు. ఇకపై సినిమా జనాలు టీజర్ తో పాటు స్టంపర్ రిలీజ్ లు కూడా స్టార్ట్ చేస్తారేమో?