మళ్లీ తెరపైకి అఖిల్ పెళ్లి

అవును.. అఖిల్ పెళ్లి మేటర్ మరోసారి వార్తల్లోకెక్కింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో అఖిల్ పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈమధ్య కాస్త తగ్గాయనుకున్న ఈ రూమర్లు మళ్లీ గుప్పుమంటున్నాయి.…

అవును.. అఖిల్ పెళ్లి మేటర్ మరోసారి వార్తల్లోకెక్కింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో అఖిల్ పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈమధ్య కాస్త తగ్గాయనుకున్న ఈ రూమర్లు మళ్లీ గుప్పుమంటున్నాయి. తాజాగా పెళ్లికి సంబంధించి మరో పుకారు షికారు చేస్తోంది.

వెంకటేష్ కూతురును అఖిల్ కు ఇచ్చి పెళ్లి చేస్తారట. ప్రస్తుతం నడుస్తున్న రూమర్ ఇదే. నిజానికి అఖిల్ కంటే వెంకటేష్ కుమార్తె పెద్ద. దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ విషయానికొస్తే అఖిల్ కోసం ఇంతకుముందు అనుకున్న శ్రియ భూపాల్ కూడా అఖిల్ కంటే పెద్ద అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

తాజాగా వినిపిస్తున్న పుకారుతో నాగార్జున ఫ్యామిలీ కాస్త ఇబ్బంది పడుతోందట. ఇప్పట్లో అఖిల్ పెళ్లి విషయం ఎత్తకూడదని నాగ్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాడు. కెరీర్ లో బాగా నిలదొక్కుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలని అనుకున్నాడు.

ఇదే విషయాన్ని అఖిల్ కు కూడా చెప్పి, కెరీర్ పై ఫోకస్ పెట్టమని సూచించాడట. ఇంతలోనే ఈ టైపు పుకార్లు రావడంతో నాగ్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అఖిల్ కు, వెంకటేష్ వరసకు మామయ్య అవుతాడనే విషయం తెలిసిందే.