సరిగ్గా 8 ఏళ్ల కిందటి సంగతి. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు సల్మాన్. ఏ సినిమా చేస్తే అది ఫ్లాప్. ఎంత పెద్ద దర్శకుడితో సినిమా చేసినా కలిసికాలేదు. సరిగ్గా అలాంటి టైమ్ లో సల్మాన్ కెరీర్ లోకి ఎంటర్ అయ్యాడు ప్రభుదేవా. వాంటెడ్ లాంటి సూపర్ హిట్ తో కండల వీరుడి కెరీర్ నే మార్చాశాడు.
వాంటెడ్ నుంచి ఇప్పటివరకు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సల్మాన్ కి. వరుసపెట్టి హిట్స్ కొట్టాడు. రికార్డుల మీద రికార్డులు తిరగరాశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ హోదా అనుభవిస్తున్నాడు.
ఆ వరుస హిట్స్ కు ట్యూబ్ లైట్ తో బ్రేక్ పడింది. మళ్లీ ఇన్నేళ్లకు సల్మాన్ కు ఫ్లాపొచ్చింది. దీంతో మరోసారి సల్మాన్ కెరీర్ లోకి ఎంటరయ్యాడు ప్రభుదేవా.
అవును.. సల్మాన్-ప్రభుదేవా కాంబోలో మూవీ ఓకే అయింది. ట్యూబ్ లైట్ ఫ్లాప్ తో స్వయంగా సల్మాన్ ఖాన్, ప్రభుదేవాకు కబురు పంపాడు. దబంగ్-3 ప్రాజెక్టును హ్యాండిల్ చేయమని రిక్వెస్ట్ చేశాడు.
మొదట ఈ సినిమాకు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను దర్శకుడిగా అనుకున్నప్పటికీ.. ట్యూబ్ లైట్ దెబ్బతో సల్మాన్ స్వయంగా రంగంలోకి దిగి ప్రభుదేవాను సెలక్ట్ చేశాడు.