మొన్నటివరకు బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో యమ బిజీగా గడిపింది. మధ్యలో సైజ్ జీరో, సింగం-3 లాంటి సినిమాలు కూడా చేసింది. అలా నాలుగేళ్ల పాటు కంప్లీట్ గా సెట్స్ పైనే గడిపిన అనుష్క ఇప్పుడు సెడెన్ గా ఖాళీ అయిపోయింది. స్ట్రయిట్ గా చెప్పాలంటే అనుష్క ఇప్పుడేం చేయట్లేదు. ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటోంది.
బాహుబలి-2 ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చిన వెంటనే భాగమతి సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అయింది అనుష్క. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది భాగమతి. దీంతో అనుష్క ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ బొమ్మాలి మాత్రం గ్యాప్ తీసుకోవడానికే ఫిక్స్ అయింది.
అయితే ఆమె ఎందుకు గ్యాప్ తీసుకుంటోందనేది పెద్ద డౌట్ గా మారింది. పెరిగిన బరువును తగ్గించుకొని మళ్లీ స్లిమ్ అవ్వడం కోసం అనుష్క ఇంకో సినిమా ఒప్పుకోలేదని కొందరు అంటున్నారు. సన్నబడిన తర్వాత తిరిగి ఫ్రెష్ గా సినిమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందట.
మరికొందరు మాత్రం ఆమె ఇక సినిమాలు చాలించి పెళ్లి చేసుకుంటుందని వాదిస్తున్నారు. అనుష్కకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అందుకే ఆమె సినిమాలు చేయడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఇంకొందరు మాత్రం ప్రభాస్ తో కలిసి మరోసారి సినిమా చేసేందుకు అనుష్క వెయిట్ చేస్తోందని, సాహో మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారని అంటున్నారు.