నిర్మాత‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు!

సినీ స్టార్ క‌మ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో సినిమాపై మ‌రోసారి సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు. ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు !.. ప్యాకేజి స్టార్ కి…

సినీ స్టార్ క‌మ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో సినిమాపై మ‌రోసారి సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు. ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు !.. ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !! అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఎద్దేవా చేశారు. సినిమా ద్వారా నిర్మాత జేబుకు చిల్లుప‌డిన ప‌వ‌న్ జేబు మాత్రం నిండింద‌ని సెటైర్లు వేశారు.

సినిమా ఎలా ఉంది.. క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి అనే దానికి ప‌క్క‌కు పెడితే స‌క్సెస్ మీట్ అంటూ పెట్టి మ‌రి అంబ‌టి రాంబాబుపై కామెంట్స్ చేసిన సినిమా యూనిట్‌పై మ‌రోసారి మంత్రి సెటైర్లు వేసిన‌ట్లుగా అర్థం అవుతుంది. ఇప్ప‌టికే త‌న‌ డ్యాన్స్‌పై సినిమాలో కామోడీ చేసి ప‌వ‌న్ నీతులు చెప్ప‌డంతో త‌న డ్యాన్స్ సంక్రాంతి అయితే ఓడిపోయిన ప‌వ‌న్‌కు డ్యాన్స్ కాళ‌రాత్రితో పోల్చిన విష‌యం తెలిసిందే.

కాగా ప‌వ‌న్ వీలు చూసుకొని రాజ‌కీయ‌లు చేసే టైంలో చేసే విమ‌ర్శ‌ల్ని వైసీపీ నుంచి తిప్పికొట్టే ప్రముఖుల్లో ముందు వరసలో ఉంటారు అంబటి రాంబాబు. పవన్ చేసే ప్రతి రాజకీయ విమర్శను గట్టిగా తిప్పికొడుతుంటారు. దీంతో ఆయన్ను రాజ‌కీయంగా ఏమి చేయ‌లేక త‌న సినిమాలో ఓ సీన్ పెట్టి ఆయ‌న‌కు నీతులు చెప్ప‌డం విశేషం. కథతో సంబంధం లేకపోయినా, ఆ సీన్ ను కట్ చేయకుండా అలానే ఉంచడానికి కారణం ఇదేనంటున్నారు చాలామంది. 

బ‌హుశా పవ‌న్ నుండి వ‌చ్చే సినిమాల్లో ఇక‌పై వైసీపీలో త‌న‌ను విమ‌ర్శించే వారిపై సినిమాలో సీన్ పెట్టి నీతులు చెప్పి అనందం పొందుతారేమే అంటూ ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ప‌వ‌న్ ఒక మాట అంటే వైసీపీ నుండి వంద మాట‌లు వ‌స్తాయానే విష‌యం ల‌క్ష పుస్త‌కాలు చ‌దివినా ప‌వ‌న్‌కు బాగా తెలిసిన న‌టుడు కావ‌డం వ‌ల్ల అర్థం అయిన కాన‌ట్లు జీవిస్తుంటారు.