చైతూ సినిమా టైటిల్ మార్చిన బన్నీ

ఈ బన్నీ ఓ పని చేయడు కదా. ఇప్పుడు నాగ్ చైతన్య సినిమా టైటిల్ మారిపోవడానికి పరోక్షంగా కారణమయ్యాడు. కొత్త డైరక్టర్ కృష్ణ డైరక్షన్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న నాగ్ చైతన్య సినిమాకు…

ఈ బన్నీ ఓ పని చేయడు కదా. ఇప్పుడు నాగ్ చైతన్య సినిమా టైటిల్ మారిపోవడానికి పరోక్షంగా కారణమయ్యాడు. కొత్త డైరక్టర్ కృష్ణ డైరక్షన్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న నాగ్ చైతన్య సినిమాకు కొన్నాళ్ల క్రితం యుద్ధం శరణం గచ్ఛామి అన్న టైటిల్ అనుకున్నారు. అనుకోవడం అంటే జస్ట్ డైరక్టర్, ప్రొడ్యూసర్, హీరో అన్నమాట. బయటకు ప్రకటించలేదు.

ఇంతలో బన్నీ సినిమా డిజె టీజర్ వచ్చింది. 'ఇప్పుడు అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సార్, యుద్ధం శరణం గచ్ఛామి' అన్న డైలాగు వుంది అందులో. దాంతో టైటిల్ వ్యవహారం మొదటికి వచ్చింది.

సినిమా లైన్ కు ఆ టైటిల్ భలే సెట్ అవుతుంది. సాఫ్ట్ గా వుండే కుర్రాడు, హ్యాపీగా సాగిపోయే ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీలో అల్ల కల్లోలం. దాంతో కుర్రాడు తీరు మార్చుని, తెలివిగా శతృవులను మట్టుపెట్టే రివెంజ్ ఫార్ములా స్టోరీ.

అంటే సాఫ్ట్ నెస్ కాదు, హార్డ్ గానే వుండాలి ఈరోజుల్లో అనే కదా. అందుకే ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి ప్రకటించారు. యుద్ధం.. శరణం అన్నది టైటిల్. టైటిల్ దగ్గర ఓ డ్రోన్ సింబల్ పెట్టారు.

ఈ సినిమాలో హీరో నాగ్ చైతన్య డ్రోన్స్ స్పెషలిస్ట్. డ్రోన్స్ ను వాడే శతృవులపై పగ తీర్చుకుంటాడు. అందుకే ఆ సింబర్. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే కొత్తగా ఏమీ అనిపించడం లేదు ఇటు హీరో అటు విలన్ కూడా. ఫస్ట్ లుక్కే కదా? బెస్ట్ లుక్కులు ఇంకా చాలా వుండే వుంటాయి.