పవన్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ టైమ్ లోనే మాంచి రేట్లు అందుకుంటోంది. హిందీకి సంబంధించి అన్ని రైట్స్ కలిపి 11 కోట్లకు విక్రయించేసారు. అంటే శాటిలైట్, థియేటర్, డబ్బింగ్, డిజిటెల్ కంటెంట్ అన్నీ కలిపి అన్నమాట.
సాధారణంగా తెలుగు సినిమాలకు ఇంత రేటు రాదు. హిందీకి పరిచయం వున్న మురగదాస్ లాంటి డైరక్టర్ లు వుంటే అది వేరు. లేదూ అంటే కోటి నుంచి నాలుగయిదు కోట్లు మాత్రమే.
అది కూడా హిందీ చానెళ్లలో వేసుకోవడానికి ఎక్కువగా కొంటారు. అలాంటిది పవన్-త్రివిక్రమ్ సినిమాకు 11 కోట్లు ఇచ్చి కొన్నారంటే కాస్త చెప్పుకోదగిన రేటు అనే అనుకోవాలి.
75 శాతం ఫూర్తి..
త్రివిక్రమ్-పవన్ సినిమా ఇప్పటికి 50శాతానికి పైగా పూర్తయిది. శంషాబాద్ దగ్గర రెండు ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించిన ఓ భారీ భవంతిని లేటెస్ట్ లోకేషన్ గా ఫిక్స్ చేసారు.
ఇక్కడ మరో రెండువారాలు సింగిల్ షెడ్యూలు వుంటుంది. దీంతో 75శాతానికి పైగా సినిమా ఫినిష్ అయిపోతుంది. అంటే జూలై ఫస్ట్ వీక్ కే 75శాతం సినిమా ఫినిష్ అయిపోయి, విఎఫ్ఎక్స్ కు అందించేస్తారు.