రంగస్థలం 1985 సినిమా టైటిల్ తోనే మెగాభిమానులకు నిలవునా నీరసం తెప్పించేసాడు దర్శకుడు సుకుమార్. డేట్ లు ఇచ్చి, సినిమా పట్టాల మీదకు తీసుకెళ్లాక ఇక చేసేది ఏముంటుంది? సరే, ఆ సంగతి అలా వుంచితే, ఈస్ట్ గోదావరిలో షూటింగ్ కు సంబంధించి ఇప్పటికి అభిమానులు దూరం నుంచో, దగ్గర నుంచో తీసిన అనేక స్టిల్స్ సోషల్ నెట్ వర్క్ లో తిరుగుతూనే వున్నాయి. అలాగే లోగో వదలనే వదిలారు.
కానీ ఎక్కడా రామ్ చరణ్ లుంగీ తప్ప, మరో డ్రెస్ కట్టిన దాఖలా లేదు ఇంత వరకు. పోనీ ఇవేమన్నా ఒక్కసారి తీసిన స్టిల్సా అంటే అదీ కాదు. ఎప్పటికప్పుడు జనాలు షూటింగ్ స్పాట్ కు వెళ్తూనే వున్నారు, ఎవరో ఒకరు క్లిక్ చేస్తూనే వున్నారు. కానీ అన్నీ లుంగీ ఫొటొలే.
ఈస్ట్ గోదావరి వాళ్లకు 70వ దశకంలో నిక్కరు, 80వ దశకంలో లుంగీ కామన్. అందువల్ల ఈ 1985 నాటి రంగస్థలంపై హీరో టైటిల్ నుంచి ది ఎండ్ వరకు మొత్తం లుంగీతో కనిపించేస్తాడా? అని అభిమానులు డవుట్ పడుతున్నారు.
సుకుమార్ చూపించినా చూపించేస్తాడు. ఆయనకు తన జిల్లా అంటే అంత ఇష్టం మరి. పోన్లెండి మైత్రీ మూవీస్ వారికి హీరో కాస్ట్యూమ్స్ ఖర్చు ఓ ముఫై లక్షలు మిగుల్తుంది.