మెగా హీరో బన్నీ మొత్తానికి మాట నిలబెట్టుకున్నాడు. ఎప్పుడో ఆరెంజ్ తరువాత మాట ఇచ్చాడు నిర్మాత కమ్ నటుడు నాగబాబుకు. ఆయనకు ఓ సినిమాకు డేట్ లు ఇస్తానని.
అలాగే గీతా ఆర్ట్స్ లో కీలకంగా వుండే బన్నీ వాసుకు మాట ఇచ్చాడు ఓ సినిమా చేస్తానని. ఈ రెండు మాటలు అలా వుండిపోయాయి. ఆఖరికి ఇప్పుడు ఆ బాకీ తీర్చేసాడు.
లగడపాటి శ్రీధర్ నిర్మాతగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కోసం డేట్ లు నాగబాబుకు, బన్నీ వాసుకు ఇచ్చేసాడు. అంటే డేట్ లు ఆ ఇద్దరివి, నిర్మాణ వ్యయం లగడపాటి శ్రీధర్ ది.
ఇందుకు గాను పావలా వాటా నాగబాబుకు, పావలా వాటా బన్నీ వాసుకు, అర్థరూపాయి వాటా లగడపాటి శ్రీధర్ కు అన్నమాట. ఇంకా విశేషం ఏమిటంటే, అల్లు అర్జున్ డేట్ లు వుండడమే నాగబాబు, బన్నీ వాసుల పెట్టుబడి. మిగిలిన పెట్టుబడి అంతా లగడపాటిదే.
బన్నీ రెమ్యూనిరేషన్ తో కలుపుకున్నా యాభై కోట్లు దాటిపోదు నిర్మాణ వ్యయం. బన్నీ మార్కెట్ 80 కి పైనే వుంది. అందువల్ల నిర్మాతలు ముగ్గురూ మంచి లాభాలు చేసుకునే అవకాశం వుంది. అదే కనుక డిజె బ్లాక్ బస్టర్ అయితే ఇక, ఈ ముగ్గురి పంట పండినట్లే. మార్కెట్ వంద దాటేస్తుంది.