ఆ స్టార్ హీరో భార్య బి గ్రేడ్ సినిమాల్లో నటించిందా?

చాలా లేటు వయసులో మూడో పెళ్లి చేసుకున్నాడు సంజయ్ దత్. భార్య మరణించిన తర్వాత ఈ హీరరో పలువురు హీరోయిన్లతో ఈ హీరో ప్రేమాయణాలు సాగించిన దాఖలాలున్నాయి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు దత్ కు…

చాలా లేటు వయసులో మూడో పెళ్లి చేసుకున్నాడు సంజయ్ దత్. భార్య మరణించిన తర్వాత ఈ హీరరో పలువురు హీరోయిన్లతో ఈ హీరో ప్రేమాయణాలు సాగించిన దాఖలాలున్నాయి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు దత్ కు పడిపోయారు. ఆ తర్వాత రియా పిళ్లైని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. విడిపోయారు.. అనంతరం విడాకులు తీసుకున్నారు.

47 యేళ్ల వయసులో దత్ మూడో పెళ్లి చేసుకున్నాడు. తనకూ, మొదటి భార్యకు పుట్టిన కూతురు త్రిశల కన్నా వయసులో కాస్తంత పెద్దదైన మాన్యతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత దత్ జీవితం కొన్నాళ్లు బాగానే గడిచింది. ఒకేసారి కవల పిల్లలు జన్మించారు. కానీ.. టాడా కేసులో వచ్చిన తీర్పు దత్ ను జైలుకు పంపింది. కొన్నేళ్ల జైలు జీవితాన్ని అనుభవించాడు.

పెరోళ్లు, సత్ప్రవర్తన వంటి వాటితో జైలు జీవితాన్ని ముగించాడు. మరి దత్ సత్ప్రవర్తన ఎలాంటిది? అని ప్రశ్నిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లారు. మరి అదేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇక ఇదే హీరో గురించి రకరకాల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి చాలా కాలం నుంచి. ప్రత్యేకించి దత్ భార్య మాన్యత మీద బి గ్రేడ్ మూవీస్ గురించి ఒక ప్రచారం ఉంది.

పాతదే అయినా.. అనునిత్యం మీడియాలో నానుతూ ఉంటుందిది. వాస్తవానికి మాన్యత ఒక ముస్లిం మహిళ. పెరిగిందంతా దుబాయ్ లో. కామన్ ఫ్రెండ్స్ ద్వారా దత్ కు ఈమె పరిచయం అయ్యిందట. అప్పటికే ‘గంగాజల్’ సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్ చేయడంతో పాటు కొన్ని కొన్ని సినిమాల్లో నటించింది. మాన్యత అసలు పేరు దిల్ నవాజ్ షేక్. స్క్రీన్ నేమ్ ను మాన్యతగా మార్చాడొక సినీరూపకర్త.

దత్ తో పరిచయం ప్రణయంగా మారింది. వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. తన కన్నా వయసులో పెద్దవాడైనప్పటికీ మాన్యత దత్ ను పెళ్లి చేసుకుంది. మాన్యత దత్ అయ్యింది. మరి ఆ సందర్భంలోనే వచ్చిందట ఒక పితలాటకం. అప్పటికే మాన్యత చేసిన ఒక బీ గ్రేడ్ సినిమా సంజయ్ ను బాగా ఇబ్బంది పెట్టిందని అంటారు. అది చాలా హాట్ సినిమా కూడా కావడంతో.. అది జనాల మధ్యన ఉండటం మంచిది కాదని దత్ భావించాడట.

ఆ సినిమా అప్పటికే విడుదల అయిపోయింది. బీ గ్రేడ్ సినిమా కదా.. ఎవరకీ పెద్దగా తెలీదు. కానీ మాన్యతకు తన భార్యగా ఫేమ్ వచ్చాకా ఆ సినిమాను రీరిలీజ్ చేశారంటే.. అది ఇండియా లెవల్లో పాపులర్ అవుతుంది. అందుకే దత్ రంగంలోకి దిగి.. ఆ సినిమాకు సంబంధించి అన్ని రకాల హక్కులనూ కొనేశాడని తెలుస్తోంది. 

ఇరవై లక్షల మొత్తానికి దత్ ఆ సినిమాను కొనేశాడట. అంతే కాదు.. ఆ సినిమాకు సంబంధించి మార్కెట్ లోకి వెళ్లిన సీడీలను కూడా వెనక్కు రప్పించేశాడట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడట దత్. మామూలుగా బాలీవుడ్ హీరోలు అలాంటి వాటిని లెక్క చేయరు. కానీ.. దత్ మాత్రం ఆ సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు.