బోయపాటి ​’​సరైనోడు​’​ అనిపించుకుంటాడా..?

సినిమాలో స్టార్ హీరో ఉంటే ఓపెనింగ్స్ వద్దన్నా వస్తాయి. అదే క్రేజ్ లేని హీరోతో సినిమా చేసి హిట్ కొడితే కచ్చితంగా ఆ క్రెడిట్ దర్శకుడికే వెళ్తుంది. అందుకే ఇప్పుడంతా బోయపాటి వైపు చూస్తున్నారు.…

సినిమాలో స్టార్ హీరో ఉంటే ఓపెనింగ్స్ వద్దన్నా వస్తాయి. అదే క్రేజ్ లేని హీరోతో సినిమా చేసి హిట్ కొడితే కచ్చితంగా ఆ క్రెడిట్ దర్శకుడికే వెళ్తుంది. అందుకే ఇప్పుడంతా బోయపాటి వైపు చూస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు ఈ మాస్ డైరక్టర్. సినిమా హిట్ అయితే అప్పుడు బోయపాటి సత్తా ఏంటో తెలుస్తుంది. కెరీర్ లో ఇప్పటివరకు బడా హీరోలతోనే సినిమాలు చేశాడు బోయపాటి.

మొదటి సినిమా భద్ర నుంచి రీసెంట్ మూవీ సరైనోడు వరకు అన్ని సినిమాల్లో స్టార్ హీరోలే ఉన్నారు. ఇప్పటివరకు చేసిన అరడజను సినిమాల్లో ఎన్టీఆర్ తో చేసిన దమ్ము మినహాయిస్తే, మిగతా అన్ని సినిమాలు హిట్సే. మరీ ముఖ్యంగా సింహా, లెజెండ్ లాంటి తిరుగులేని విజయాలున్నాయి బోయపాటి ఖాతాలో. 

ఈసారి మాత్రం బోయపాటికి బలమైన హీరో లేడు. కేవలం తన కథ, కథనంతోనే సినిమాను ఒడ్డుకు చేర్చాల్సిన బాధ్యత ఇతడిపై పడింది. సరైనోడు సినిమాకు విడుదలైన కొత్తలో నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ స్టార్ డమ్ వల్ల నెట్టుకొచ్చింది. కానీ ఈ కొత్త సినిమాకు అలాంటి టాక్ కనుక మొదలైతే ఇక ఆగదు. థియేటర్లలో సినిమా నిలవదు. 

సో.. బోయపాటి కెరీర్ కే ఇది సిసలైన పరీక్ష. ఈ సినిమా సక్సెస్ అయితే ఎలాంటి హీరోతో అయినా బోయపాటి హిట్ కొట్టగలడు అనే ఇమేజ్ వస్తుంది. తేడాకొడితే మాత్రం స్టార్ హీరో లేకుండా బోయపాటి సినిమా చేయలేడనే నెగెటివ్ రిమార్క్ పడిపోతుంది.

బోయపాటి-బెల్లంకొండ కొత్త సినిమా టైటిల్ లోగోను ఈరోజు మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారు.