సందీప్ కిషన్ సరైన బ్రేక్ కోసం చూస్తూ, వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న యంగ్ హీరో. అతడి ఆశలన్నీ డైరక్టర్ కృష్ణవంశీ సినిమా నక్షత్రం మీదనే వున్నాయి. అయితే ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ నటించిన మరో సినిమా కూడా ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో సందీప్ పాత్ర ఏమీలేదు. ఆయా సినిమాల నిర్మాతలు అలా అనుకుంటున్నారంతే. సందీప్ నటించిన నక్షత్రం సినిమాను జూలై 14న విడుదల చేసే ఆలోచనలో వున్నారు దర్శకుడు కృష్ణవంశీ.
అయితే సందీప్ తో పాటు ఆది సాయికుమార్, నారా రోహిత్, సుధీర్ కుమార్ కలిసి నటించిన శమంతకమణి చిత్రాన్ని కూడా అదే రోజు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు భవ్య క్రియేషన్స్ వారు.
వాస్తవానికి శమంతకమణి ని జూన్ నెలాఖరు లేదా జూలై ఫస్ట్ వీక్ లో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ కాస్త వర్క్ వుండిపోయింది. అందువల్ల జూలై 14కు ఫిక్స్ అవుదాం అనుకుంటున్నారు. నక్షత్రం కూడా అదే డేట్ కోసం చూస్తోంది. చూడాలి మరి ఎవరు అటు ఇటు జరుగుతారో?