ఈ ఏడాది ఒక్క సినిమా మినహా మిగిలిన అన్నింటిలో భయంకరమైన లాభాలు చేసుకుంటున్నారు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. శతమానంభవతి కాసుల పంట పడించింది. ఆపై నేను లోకల్ ఆ దారిలోనే పయనించింది. ఓం నమో వేంకటేశాయ మాత్రం కాస్త వెనక్కు లాగింది.
అయితే శతమానంభవతి, నేను లోకల్ ఇచ్చిన లాభాలు వేరు, వచ్చేవారం విడుదలవుతున్న డిజె సినిమా ఇస్తున్న ప్రాఫిట్స్ వేరు. ఈ సినిమా దిల్ రాజు భయంకరమైన లాభాలు విడుదలకు ముందే అందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటోంది.
దాదాపు అన్నీ కలిపి పాతిక కోట్ల వరకు దిల్ రాజు డిజె సినిమాతో లాభం చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నైజాం, కృష్ణా, విశాఖ మినహా మిగిలిన ఏరియాలు అన్నీ అమ్మేసారు.
ఈస్ట్ మాత్రం బన్నీ స్వంత సంస్థ గీతాకు అందించారు. ఫిగర్లు ఇవీ అని ఇదమిద్దంగా ఇంకా బయటకు రాలేదు కానీ, పాతిక కోట్లు కచ్చితమైన లాభాలు మాత్రం డిజె అందించిందని తెలుస్తోంది.
బన్నీ మూవీ మార్కెట్ ఇప్పుడు ఎంత తక్కువగా చూసుకున్నా 60 నుంచి 70కోట్ల మధ్యలో వుంది. ఈ సినిమా దిల్ రాజు చాలా పొదుపుగానే వెళ్లారని తెలుస్తోంది. చివర్లో కొద్దిగా అవసరం అయితే సాంకేతిక నిపుణులను కాంట్రాక్టు పద్దతిన తీసుకుని ఫినిష్ చేసారు. అందువల్ల మేకింగ్ కు మరీ భయంకరంగా ఖర్చయిపోలేదని తెలుస్తోంది.
పైగా దిల్ రాజు ఖర్చు దగ్గర చాలా కాలుక్యులేటెడ్ గా, జాగ్రత్తగా వుంటారు. అందువల్ల ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు పాతిక కోట్ల ప్రాఫిట్ కచ్చితంగా వుండే వుంటుందని తెలుస్తోంది. ఈ రోజుల్లో పెద్ద సినిమాకు పాతిక కోట్ల ప్రాఫిట్ అంటే అంత చిన్న విషయం కాదు. చాలా అదృష్టమనే చెప్పాలి. అది దిల్ రాజుకు ఫుల్ గా వున్నట్లే వుంది.