సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అన్నట్లు వుంది పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా పరిస్థితి. వంద కోట్లకు పైగా ఖర్చు చేసి, అంతకు అంతా లాభాలు చేసుకుందాం అనుకున్నారు. కానీ అలా జరగాలి అంటే సంక్రాంతికే విడుదల చేయాలని బయ్యర్లు అంటున్నారు. అంతవరకు వెయిట్ చేయడం ఇష్టంలేదు, ఇటు నిర్మాతలకు, దర్శకుడు త్రివిక్రమ్ కు. అందుకే దసరా టార్గెట్ గానే రెడీ అవుతున్నారు.
దసరాకు రెండు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. మహేష్, బాలయ్య డేట్ లు ఇచ్చేసారు. వాటికి కాస్త ముందుగా ఎన్టీఆర్ సినిమా వుంది. వీటి మధ్యలో దించాలి పవన్ సినిమాను. లేదా దీపావళికి వెళ్లాలి. ఏదైనా కూడా అంత భారీ వసూళ్లు అంటే అనుమానం. పోనీ బయ్యర్లు అన్నమాట మేరకు సంక్రాంతికి వెళ్ధాం అంటే, మరో మెగా హీరో రామ్ చరణ్ రుమాలు వేసేసారు. మెగా హీరో సినిమాపై పవన్ తన సినిమా వేసే చాన్సేలేదు. మహేష్ సినిమా వస్తుందని అంటున్నారు కానీ అది అనుమానం. దీనికి టైమ్ సరిపోకపోవచ్చు.
అలాగే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కూడా అనుమానమే. ఎందుకంటే త్రివిక్రమ్ ఆ సినిమా దర్శకుడు. ఆయన ఇష్టం కూడా చూడాల్సి వుంటుంది. అలాంటి సోలో డేట్ ను పట్టుకున్నాడు రామ్ చరణ్. దాన్ని చెడగొడతాడా బాబాయ్ పవన్. కావాలంటే తనే రెండు వారాలు వెనక్కు వెళ్తాడు. ఎందుకుంటే ముందుకు వస్తే టార్గెట్ రీచ్ కాలేరు. ఇలా ఇటు దసరాకు, అటు సంక్రాంతికి రెండింటికి డైలామాలో పడింది పవన్ – త్రివిక్రమ్ సినిమా.