అసలు సంగతి రేపు తేలిపోతుంది

బాలీవుడ్ లో రేపు రాబ్తా అనే సినిమా విడుదలకానుంది. ఇందులో స్టార్ హీరోహీరోయిన్లు ఎవరూ లేరు. కానీ టాలీవుడ్ దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది. ఎందుకంటే మగధీర సినిమాను కాపీ కొట్టి రాబ్తా మూవీ…

బాలీవుడ్ లో రేపు రాబ్తా అనే సినిమా విడుదలకానుంది. ఇందులో స్టార్ హీరోహీరోయిన్లు ఎవరూ లేరు. కానీ టాలీవుడ్ దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది. ఎందుకంటే మగధీర సినిమాను కాపీ కొట్టి రాబ్తా మూవీ తీశారనే ఆరోపణలున్నాయి. అందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
 
మగధీర వర్సెస్ రాబ్తా.. ఈ మధ్యంతా ఈ రెండు సినిమాల మధ్య చాలా లొల్లి నడిచింది. వ్యవహారం కోర్టు కేసు వరకు వెళ్లింది. మగధీర సినిమాను యాజ్ ఇటీజ్ లేపేశారని గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాబ్తా నిర్మాతలకు నోటీసులు కూడా పంపించింది. దీనికి రాబ్తా యూనిట్ ఘాటుగానే స్పందించింది. అన్ని సినిమాలూ మగధీరలా ఉండవని కాస్త కామెడీగానే సెటైర్లు వేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండంటూ జవాబిచ్చింది.

ఇలా 2 నిర్మాణ సంస్థల మధ్య లీగల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో రాబ్తా మూవీ థియేటర్లలోకి వస్తోంది. సుశాంత్ సింగ్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మగధీరను పోలి ఉన్నాయి. మగధీరలా ఇది కూడా పీరియాడిక్ డ్రామా. మగధీరలో రామ్ చరణ్ ఎంట్రీని పోలినట్టే ఇందులో సుశాంత్ ఇంట్రడక్షన్ ఉంది. మగధీరలో ఉన్న ఘోరా లాంటి పాత్రను ఇందులో రాజ్ కుమార్ రావు పోషించాడు.