బౌండెడ్ స్క్రిప్ట్ చేతిలో ఉండి, హీరో కాల్షీట్లు అందుబాటులో ఉంటే ఇదే అడ్వాంటేజ్. ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా అనుకున్న తేదీ కంటే కాస్త ముందే రెడీ అయిపోతోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్ట్ నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా మూవీ జులై ఎండింగ్ కే రెడీ అయిపోతుందట.
సినిమాలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్న ఎన్టీఆర్, ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ మొత్తం జై లవకుశ పైనే పెట్టాడు. మరో పని పెట్టుకోకుండా కాల్షీట్లన్నీ దీనికే కేటాయించాడు.
హీరోతో పాటు మిగతా టీం అంతా రెడీగా ఉండడంతో షూటింగ్ చకచకా సాగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఏకథాటిగా షూటింగ్ చేస్తారు.
జై లవకుశ సినిమాకు సంబంధించి వచ్చే నెలలో కూడా మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ తో టాకీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జులై ఆఖరి వారం లేదా ఆగస్ట్ మొదటి వారానికి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పూర్తిస్థాయిలో ప్రమోషన్ పై దృష్టిపెట్టాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్.