రామ్ చరణ్ ఫ్యాషన్ స్టేట్ మెంట్స్

ఒకప్పుడు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరోలు ఫ్యాషన్స్ ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రామ్ చరణ్ కు కూడా లేటెస్ట్ ఫ్యాషన్స్ పై చాలా అవగాహన…

ఒకప్పుడు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరోలు ఫ్యాషన్స్ ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రామ్ చరణ్ కు కూడా లేటెస్ట్ ఫ్యాషన్స్ పై చాలా అవగాహన ఉంది. ఇంతకీ ఫ్యాషన్స్ లో రామ్ చరణ్ టేస్ట్ ఏంటి? నేటి యూత్ కు ఫ్యాషన్ విషయంలో చరణ్ ఇచ్చే సలహా ఏంటి?

“బ్లాక్, వైట్, గ్రే.. ఈ 3 కలర్స్ తో కూడిన దుస్తులు తప్పనిసరిగా అబ్బాయిల వార్డ్ రోబ్ లో ఉండాలి. షర్ట్, టీ షర్ట్.. ఇలా కాంబినేషన్ ఏదైనా ఈ 3 కలర్స్ మెయింటైన్ చేయండి. సందర్భం ఏదైనప్పటికీ ధరించడానికి అనువుగా ఉండే రంగులు ఇవి. మీ బీరువాలో బ్లాక్ షర్ట్ లేదా టీషర్ట్.. వైట్ షర్ట్ లేదా టీషర్ట్ తప్పనిసరిగా ఉండాలి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ రెండు కలర్స్ మస్ట్.”

పాప్ స్టార్స్ నుంచి చాలామంది సెలబ్రిటీలు బ్లాక్ ధరించి అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంటారనే విషయాన్ని గుర్తుచేశాడు చరణ్. ఇక పార్టీల్లో కూడా బ్లాక్ కలర్ కు తిరుగులేదంటున్నాడు.

“పార్టీ లేదా రెస్టారెంట్ కు ఫ్రెండ్స్ తో వెళ్లాల్సి వస్తే బ్లాక్ కలర్ వేయడానికి ఇష్టపడతాను. నైట్ పార్టీల్లో బ్లాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మన లోపాలన్నింటినీ బ్లాక్ కవర్ చేసేస్తుంది. చాలామంది నలుపు రంగు దుస్తులు వేయడానికి కారణం ఇదే.”

ఫ్యాషన్ యాక్ససిరీస్ కు సంబంధించి వాచీల కోసం ఎక్కువ  ఖర్చు పెడతాడంట చరణ్. ఇక అతి తక్కువగా చెప్పులపై ఖర్చు చేస్తానని వెల్లడించాడు. నటీనటుల విషయానికొస్తే.. హీరోల్లో సైఫ్ అలీఖాన్, హీరోయిన్లలో దీపక పదుకోన్ ఫ్యాషన్ స్టయిల్స్ తనకు ఇష్టం అంటున్నాడు ఈ మెగా హీరో.