సూపర్ స్టార్ సినిమాకు బెనిఫిట్ షోలు లేవా..?

ఓ పెద్ద సినిమా వస్తుందంటే పుకార్లు ఆటోమేటిగ్గా పుట్టుకొస్తాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాపై కూడా అలాంటి రూమర్సే వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సూపర్ స్టార్ నటించిన ఏ సినిమాకు ఇలాంటి పుకారు రాకపోవడం విశేషం.…

ఓ పెద్ద సినిమా వస్తుందంటే పుకార్లు ఆటోమేటిగ్గా పుట్టుకొస్తాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాపై కూడా అలాంటి రూమర్సే వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సూపర్ స్టార్ నటించిన ఏ సినిమాకు ఇలాంటి పుకారు రాకపోవడం విశేషం.

జైలర్ అనే సినిమా చేస్తున్నారు రజనీకాంత్. నెల్సన్ దర్శకుడు. ఆగస్ట్ 10న థియేటర్లలోకి రాబోతోంది. రజనీకాంత్ నటించిన ఏ సినిమా అయినా తమిళనాట ఉదయం 4 గంటల షో పడాల్సిందే. అయితే జైలర్ సినిమాకు మాత్రం ఆ అవకాశం లేదంటూ పుకారు మొదలైంది. ఒక దశలో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది.

దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. తమ హీరో సినిమా బెనిఫిట్ షోలు ఆపితే ఊరుకునేది లేదంటూ ట్విట్టర్ లో శాపనార్థాలు పెట్టారు. రజనీకాంత్ సినిమాకు 4 గంటల షోకు అనుమతి లేదని, ఉదయం 9 గంటల నుంచి సినిమాను ప్రసారం చేసుకోవచ్చంటూ ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చినట్టు కథనాలు వచ్చాయి.

అయితే వీటిలో ఎలాంటి నిజం లేదంటున్నారు అధికారులు. రజనీకాంత్ సినిమాకు ఉదయం 4 గంటల బెనిఫిట్ షో అనుమతులకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎప్పట్లానే అనుమతులు వచ్చే అవకాశం ఉందంటూ క్లారిటీ ఇచ్చారు.

ఫ్యాన్స్ ఇంతలా ఆందోళన చెందడానికి ఓ కారణం ఉంది. గతంలో విజయ్ నటించిన ఓ సినిమాకు ఇలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు ఇవ్వలేదు అప్పటి తమిళనాడు సర్కార్. దీంతో జైలర్ సినిమాకు కూడా అలాంటిదేదో జరిగి ఉంటుందని ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ అలాంటిదేం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు.