బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి సినిమా ఏమిటి? అన్నది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదాన్ని మించిపోయిన ప్రశ్నగా మారుతోంది. ఎన్టీఆర్ అంటే ఇష్టం, కానీ ఆయనతోనే చేస్తానా అన్నది చెప్పలేను అని హింట్ ఇచ్చాడు రాజమౌళి.
అయితే అందులోనే చేస్తారేమో అన్న అనుమానం కూడా వుంది. మహేష్ తో కూడా రాజమౌళి ఎప్పటికయినా ఓ సినిమా చేస్తాడనే వార్తలు కూడా వున్నాయి.
ఇదిలా వుంటే, ఇటీవలి వ్యవహారాలు చూస్తుంటే, రాజమౌళి మెగాహీరోలతో మాత్రం సినిమా చేయడేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎప్పటిదో మగధీర సంగతులు ఇప్పుడు కెలకడం, అప్పటి మగధీర రికార్డులు ఫేక్ అనే అనుమానం వచ్చేలా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది.
తన సినిమా రికార్డులే తానే ఫేక్ అని చెప్పడం ద్వారా రాజమౌళి తాను గొప్పోడు అన్న ఫీల్ అయితే తెచ్చుకుంటాడేమో కానీ, మెగా రికార్డులు అన్నీ ఫేక్ అన్న అనుమానాలు కూడా కలిగిస్తున్నాడు.
ఇది సహజంగానే మెగా హీరోలకు కాస్త ఇబ్బందికరమైన విషయం. అరవింద్ తో తేడా వచ్చింది ఇక్కడే అని తానే చెప్పాడు. మరి బన్నీతో సినిమా చేస్తాడా? మగధీర రికార్డుల తేడా అన్నవాడు రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా?
అందువల్ల ఇక ఫ్యూచర్ లో మెగా హీరోలతో రాజమౌళి సినిమా చేసే అవకాశమే వుండకపోచవ్చేమో?