కేసీఆర్ పాత్రకు తెలుగు నటులే దొరకలేదా..!

ఓ తెలుగు ముఖ్యమంత్రికి సంబంధించిన సినిమా. తెలుగు వ్యక్తి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా. కానీ అందులో లీడ్ రోల్ చేయడానికి మాత్రం తెలుగు నటులు దొరకట్లేదట. చివరికి కేసీఆర్ బయోపిక్…

ఓ తెలుగు ముఖ్యమంత్రికి సంబంధించిన సినిమా. తెలుగు వ్యక్తి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా. కానీ అందులో లీడ్ రోల్ చేయడానికి మాత్రం తెలుగు నటులు దొరకట్లేదట. చివరికి కేసీఆర్ బయోపిక్ కు కూడా పరభాషా నటుల్నే ఎంపిక చేసుకునే దుస్థితి దాపురించింది.

పెళ్లిచూపులు సినిమాతో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కందుకూరి.. కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా నిర్మించబోతున్నాడు. మధుర శ్రీధర్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. ఈ నిజజీవిత గాథలో కేసీఆర్ పాత్రను పోషించే నడుడి కోసం వెదుకుతున్నారు.

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును సంప్రదించారట. రాజ్ కుమార్ రావు, కేసీఆర్ ముఖాల్లో పోలికలు దగ్గరగా ఉంటాయని అంటున్నాడు మధుర శ్రీధర్. 

మరోవైపు తమిళ నటుడు, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోనీ ప్రొఫైల్ కూడా పరిశీలిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ముఖ కవలికలు కూడా కేసీఆర్ కు దగ్గరగా ఉంటాయని అంటున్నారు. వీళ్లలో ఒకర్ని కేసీఆర్ పాత్ర కోసం తీసుకొని, షూటింగ్ మొదలుపెడతారట. ఎన్నికల సమయానికి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ కేసీఆర్ పాత్ర పోషించడానికి తెలుగు నటులే దొరకలేదా అనేది ప్రశ్న. నిశితంగా పరిశీలిస్తే తెలుగులో కేసీఆర్ ముఖానికి దగ్గరగా ఉండే వ్యక్తులు, కేసీఆర్ లా మేనరిజమ్స్ ప్రదర్శించగల నటులు కచ్చితంగా దొరుకుతారు. 1967 నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు కేసీఆర్ జీవితంలోని మలుపుల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.