ఒకే ఇయర్ లో పవన్ రెండు సినిమాలు చేయడం అరుదు. 2006, 2011, 2012లో మాత్రమే అలా జరిగింది. సేమ్ సీన్ 2017లో కూడా రిపీట్ అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఈ ఏడాది ఇప్పటికే కాటమరాయుడు సినిమాను రిలీజ్ చేసిన పవన్.. దసరా కానుకగా త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీని థియేటర్లలోకి తీసుకొస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అలా జరగడం లేదు.
తాజా సమాచారం ప్రకారం, పవన్-త్రివిక్రమ్ సినిమా దసరాకు రావడం లేదు. కనీసం నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా రావట్లేదు. ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. అవును.. పవన్-త్రివిక్రమ్ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట.
సంక్రాంతి బరిలో పవన్ చాలా తక్కువగా మెరిశాడు. కెరీర్ స్టార్టింగ్ లో అతడు నటించిన సుస్వాగతం సినిమా, ఆ తర్వాత బాలు అనే మరో సినిమా మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో సుస్వాగతం హిట్ అయితే బాలు ఫ్లాప్ అయింది. ఇక వెంకీతో కలిసి చేసిన గోపాల గోపాల కూడా సంక్రాంతికే వచ్చినప్పటికీ.. దాన్ని పవన్ సోలో సినిమా కింద లెక్కవేయలేం. ఒకవేళ దాన్ని పవన్ కౌంట్ లో వేసినా కూడా అది హిట్ మూవీ కాదు.
సో.. ఇప్పటివరకు పవన్ కెరీర్ లో సంక్రాంతి హిట్ కేవలం ఒకే ఒక్క సినిమా. మళ్లీ ఇన్నేళ్లకు త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీని సంక్రాంతి బరిలో నిలిపాడు పవన్. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో.