ఏమయినా వర్మ ఓ సంచలనం

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ నుంచి నిష్క్రమించాడు. ఇది వార్త. ఇన్నాళ్లు, నిర్భయంగా, నిర్మొహమాటంగా కొండకచో నిస్సిగ్గుగా, ట్విట్టర్ వేదికగా అనేక ట్వీట్లు సంధిస్తూ వచ్చాడు వర్మ. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే వర్మకు ధైర్యం…

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ నుంచి నిష్క్రమించాడు. ఇది వార్త. ఇన్నాళ్లు, నిర్భయంగా, నిర్మొహమాటంగా కొండకచో నిస్సిగ్గుగా, ట్విట్టర్ వేదికగా అనేక ట్వీట్లు సంధిస్తూ వచ్చాడు వర్మ. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే వర్మకు ధైర్యం ఎక్కువ అనేకన్నా మొండితనం ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో వున్నవాళ్లంతా అదీ ముఖ్యంగా టాలీవుడ్ తో సంబంధాలు వున్నవారంతా, నిజాలు నిర్మొహమాటంగా మాట్లాడడం అన్నది అసాధ్యం.

టీజర్ రావడం భయం, సినిమా విడుదల కావడం ఆలస్యం, ట్విట్టర్ లో భాజా భజంత్రీలు మోగించేవారే ఎక్కువ. నిర్మొహమాటంగా మాట్లాడేవారు అరుదు. అయితే రామ్ గోపాల్ వర్మ నిర్మొహమాటి మాత్రమే కాదు. కాస్త అతివాదం కూడా ఎక్కువే. తనకు నచ్చకపోయినా, తనకు కావాల్సి వున్నా, ఆయన ట్వీట్లలో ఈ అతివాదం కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో ఇది క్లియర్. చిరు 150 వ సినిమా టైమ్ లో కానీ, బాహుబలి టైమ్ లో కానీ వర్మ కాస్త అతికి వెళ్లారన్నది వాస్తవం.  

కానె సినిమాలకు సంబంధం లేని సైద్ధాంతిక విషయాల్లో మాత్రం రామ్ గోపాల్ వర్మ తెలివి తొంగి చూస్తుంది.నిజానికి తనను తాను కాస్త నియంత్రించుకోగలిగితే, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు ట్విట్టర్ కు అవసరమే.  ఏమైనా టాలీవుడ్ వదిలేసి వెళ్లాడు, మళ్లీ వచ్చాడు. మళ్లీ వదిలేసాడు. బాలీవుడ్ వదిలేసి వచ్చాడు. మళ్లీ వెళ్లాడు. అందువల్ల ట్విట్టర్ లోకి వస్తాడనే అనుకుందాం.