చలపతి కామెంట్స్.. చైతూ సినిమాపైనా ఫైర్!

నడ్డిమీద తంతే మూతిపళ్లు రాలడం అంటే ఇదే కాబోలు.. చలపతిరావు కామెంట్లు అటు తిరిగి ఇటు తిరిగి చైతూ సినిమా మీదకు, మరోవైపు బూతు షోలపై చర్చకు దారి తీస్తున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ…

నడ్డిమీద తంతే మూతిపళ్లు రాలడం అంటే ఇదే కాబోలు.. చలపతిరావు కామెంట్లు అటు తిరిగి ఇటు తిరిగి చైతూ సినిమా మీదకు, మరోవైపు బూతు షోలపై చర్చకు దారి తీస్తున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ చలపతిరావు ఈ సినిమా హైలెట్ చేసిన ఒక డైలాగ్ ను ప్రస్తావించారు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం..’ అంటూ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ట్రైలర్ లోని మాటను చలపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అత్యంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిన చలపతిరావు కూడా ఆ వ్యాఖ్యను తప్పుపట్టడం గమనార్హం. అసలుకు.. ఆ మాటను ఖండిస్తూనే తను ‘పక్కలోకి పనికి వస్తారు..’ అన్నాను అనేది చలపతిరావు భాష్యం. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం..’ అనేమాటనే చలపతిరావు తప్పు పట్టారు. అదెంత తప్పుడు మాట అండి? అని ఆయన ప్రశ్నించారు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు.. అని తాను చెప్పబోయాను అని, ఆ మాటనే తప్పు పట్టబోయేను… అని చలపతిరావు అంటున్నారు. మరి ఆయన అనడమే కాదు.. ఈ డైలాగ్ తో భగ్నప్రేమికులైన అబ్బాయిలను ఆకట్టుకున్నామని ఫీలవుతున్న ‘రారండోయ్..’ యూనిట్ ఇప్పుడు గతుక్కుమంటోంది. అవతల సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ డైలాగ్ పట్ల నిరసనలు వ్యక్తం అవుతోంది.

‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం..’ అనడం ఏమిటి? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలంటే.. చాలా సినిమాల్లో అమ్మాయిలనో, అబ్బాయిలనో.. తక్కువ చేసే మాటలు ఉంటాయి. సరదాగానో, సీరియస్ గానో ఇలాంటి డైలాగులు బోలెడన్ని ఉంటాయి. వాటన్నింటినీ పట్టుకుని కూర్చుంటే అంతే సంగతులు. అయితే.. చలపతిరావు వ్యాఖ్యల పుణ్యమా అని.. ఈ సినిమా డైలాగ్ మీద కూడా పోస్టుమార్టం మొదలైంది. మరి చలపతిరావు రాజేసిన వివాదం ఎటుపోయి ఎటొస్తుందో అనేభయం తో ఇప్పటికే నాగార్జున ఆయన వ్యాఖ్యలను ఖండించేశాడు. చలపతిరావు వ్యాఖ్యలతో తను ఏకీభవించనని నాగార్జున ట్వీట్ పెట్టాడు. అయినప్పటికీ.. చర్చ ఈ సినిమా డైలాగ్ మీదకు మళ్లుతోంది. మరి ఎంత వరకూ వెళ్తుందో.