జై లవకుశ ఫస్ట్ లుక్ లో క్యారెక్టర్ పేరు అదే..!

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఆ విలన్ గెటప్ స్టిల్స్ నే ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారనే విషయం స్టిల్స్ చూస్తే…

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఆ విలన్ గెటప్ స్టిల్స్ నే ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారనే విషయం స్టిల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే, బ్యాక్ గ్రౌండ్ లో రావణాసురుడి బొమ్మ పెట్టారు కాబట్టి అది కచ్చితంగా విలన్ పాత్రే.

అయితే ఈ క్యారెక్టర్ పేరు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జై లవకుశ సినిమాలో జయకుమార్ (జై), లవకుమార్ (లవ్), కుశాల్ అనే మూడు పాత్రలు పోషిస్తున్నాడు ఎన్టీఆర్. మరి ఈ 3 పాత్రల్లో ఏ క్యారెక్టర్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ఇది..? ఈ ముగ్గుర్లో ఎవరు విలన్..?

తాజా సమాచారం ప్రకారం.. జై లవకుశ సినిమాలో జై క్యారెక్టరే విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన స్టిల్ నే ఫస్ట్ లుక్ గా విడుదల చేశారని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ నందిత వస్తుందట. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.