సినిమాలన్నీ షెడ్యూళ్లు మారుతున్నాయ్

పెద్ద హీరోల సినిమాలు ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు సాగడం అంటే కాస్త కష్టమే. ఎందుకంటే, మధ్య మధ్యలో కొత్త అయిడియాలు వస్తుంటాయి. హీరోలకు వేరే పనులు వస్తుంటాయి. అనుకున్నట్లు షెడ్యూళ్లు సాగవు. ఇప్పుడు టాలీవుడ్…

పెద్ద హీరోల సినిమాలు ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు సాగడం అంటే కాస్త కష్టమే. ఎందుకంటే, మధ్య మధ్యలో కొత్త అయిడియాలు వస్తుంటాయి. హీరోలకు వేరే పనులు వస్తుంటాయి. అనుకున్నట్లు షెడ్యూళ్లు సాగవు. ఇప్పుడు టాలీవుడ్ లో షూటింగ్ లు జరుపుకుంటున్న సినిమాలు అన్నీ ఇలాగే ముందుకు వెనక్కు నడుస్తున్నాయి.

మహేష్ బాబు స్పయిడర్ సంగతి తెలిసిందే. క్వాలిటీ, విఎఫ్ఎక్స్, తమిళ వెర్షన్ ఇలాంటివి అన్నీ కలిసి ఆ సినిమాను వెనక్కు వెనక్కు జరుపుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఆ సినిమా ఏకంగా దీపావళికే విడుదలవుతుందని.

ఇక సుకుమార్-చరణ్ సినిమా కూడా అనుకున్నట్లు సాగడం లేదు. అసలు ప్రారంభం కావడమే ఇదిగో అదిగో అని లేట్ అయింది. దానికి తోడు ఎండలు, ఇతరత్రా వ్యవహారాలు కలిసి ఆ సినిమాను వెనక్కు నెడుతున్నాయి.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా చకచకా వెళ్లిపోతుందని అనుకున్నారు. ఇప్పటి దాకా అలాగే వుంది కానీ, అది కూడా కాస్త ఆలస్యం అవుతుందని వినికిడి. విదేశీ ఫైటర్ తో పవన్ తన ఫామ్ హవుస్ లో శిక్షణ పొందుతున్నారు. ఎండలు తగ్గాక ఆయన కొద్ది రోజులు సీమలో పర్యటించాలని అనుకుంటున్నట్లు వినికిడి. అందువల్ల ఆ ప్రాజెక్టు కూడా అనుకున్న డేట్ కు రాదని తెలుస్తోంది.

బన్నీ సినిమా ఇప్పటికే డేట్ మార్చుకుంది. అందరూ బాహుబలి కారణంగా అనుకున్నారు. కానీ సినిమా వర్క్ పెండింగ్ వుండిపోవడమే అసలు కారణం. ఇప్పటికీ ఇంకా క్లయిమాక్స్ ఫైట్, రెండు పాటలు పెండింగ్ లో వున్నాయి.

ఎన్టీఆర్ సినిమా స్టడీగానే వర్క్ జరుపుకుంటోంది కానీ, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ మారడంతో లొకేషన్లు, డిస్కషన్లు వంటివి కొత్తగా చోటు చేసుకుంటున్నాయి.

వరుణ్ తేజ ఫిదా అయితే పెద్ద హీరోల సినిమాల మాదిరి వందరోజులకు పైగా పని దినాలకు డేకేస్తోంది.

వీళ్లందరితో పోల్చుకుంటే బాలకృష్ణ-పూరిజగన్నాధ్ సినిమా మాత్రమే పక్కా షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతోంది. ఈ లెక్కన దసరా బరిలో బాలయ్య సోలో హీరోగా నిలిచేలా వున్నారు.