కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ తన 102వ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చేనెల చివర్లో ప్రారంభం కానున్న ఈ సినిమా, జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బాలయ్య. దీనికి కారణం ఇది రజనీకాంత్ కోసం రాసుకున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడమే.
రజనీకాంత్-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్. వీళ్లిద్దరూ కలిసి తీసిన ముత్తు, నరసింహా లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ ను పెట్టి లింగ సినిమా తీశారు కేఎస్ రవికుమార్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.
లింగ ఫ్లాప్ తర్వాత మరోసారి రజనీకాంత్ కోసం ఓ స్టోరీ రెడీ చేసుకున్నారు కేఎస్ రవికుమార్. కానీ సూపర్ స్టార్ ప్రస్తుతం కబాలి దర్శకుడు పా రంజిత్ తో సినిమా చేయబోతున్నారు. అలా రజనీకాంత్ కోసం రాసుకున్న కథను అనుకోకుండా బాలయ్యకు వినిపించడం, బాలకృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయట.