పవన్ కు ఫారిన్ ఫైటర్ శిక్షణ

హీరోల్లో తొలిసారి ఫైట్ల మీదా, ట్రయినింగ్ మీదా ఇంట్రెస్ట్ చూపించడం ప్రారంభించింది పవన్ కళ్యాణ్ నే. సుమన్ , భాను చందర్ లాంటి వాళ్లు కరాటే నేర్చుకున్నారు. అయితే ఇప్పటి హీరోల్లో ఎప్పటికి అప్పడు…

హీరోల్లో తొలిసారి ఫైట్ల మీదా, ట్రయినింగ్ మీదా ఇంట్రెస్ట్ చూపించడం ప్రారంభించింది పవన్ కళ్యాణ్ నే. సుమన్ , భాను చందర్ లాంటి వాళ్లు కరాటే నేర్చుకున్నారు. అయితే ఇప్పటి హీరోల్లో ఎప్పటికి అప్పడు కొత్త మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో పవన్ దారి తీసారు. ఆ తరువాత బన్నీ కూడా అలాంటి ప్రయత్నాలు చేసారు.

అసలు విషయానికి వస్తే, ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో పవన్ సినిమా చేస్తున్నారు ఇప్పుడు. ఈ సినిమా లో ఫుల్ గా ఫైట్లు వుంటాయట. ఇప్పటికే ఓ ఫైట్ ను రవివర్మ డిజైన్ చేసారు. మరో రెండు ఫైట్లను పీటర్ హెయిన్స్ డైరక్ట్ చేయబోతున్నారు. ఇంకో ఫైట్ ను మళ్లీ రవివర్మ చేస్తారు. ఇవి కాక, ఫారిన్ లోకేషన్ లో ఓ మాంచి ఫైట్ వుంటుందట. దాన్ని ఓ ఫారిన్ ఫైట్ మాస్టర్ డిజైన్ చేసారు ఇప్పటికే. 

డిజైన్ చేయడమే కాకుండా, అతగాడు ఇటీవల ఇండియా వచ్చి కొద్ది రోజులు ఇక్కడే వుండి పవన్ కు ఆ ఫైట్ సీక్వెన్స్ లో ట్రయినింగ్ ఇచ్చి వెళ్లాడట. ఇంతకు ముందు పవన్ తో అత్తారింటికి దారేది అని ఫక్తు ఫ్యామిలీ మూవీ అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీ అందిస్తున్నారు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం చిలుకూరులో ముగించుకుని, రేపు, ఎల్లుండి హైటెక్స్ లో జరగబోతోంది.