త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎన్టీఆర్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్ కు టైం, టైమింగ్ రెండూ సెట్ అవ్వలేదు. ఎట్టకేలకు ఆ ముహూర్తం రానే వచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో సెట్ అయింది. ఇది చాలా రోజుల కిందటి ముచ్చటే. కానీ ఇప్పుడీ ప్రాజెక్టు సెట్స్ పైకి రావాలంటే మాత్రం అది పవన్ కల్యాణ్ చేతిలో ఉంది.
ఎన్టీఆర్ సినిమా సెట్ అయిన మాట వాస్తవమే కానీ పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తారక్ తో సినిమా చేయగలడు త్రివిక్రమ్. పవన్ నో అంటే మాత్రం మాటల మాంత్రికుడు చేసేదేం లేదు. ఎన్టీఆర్-పవన్ మధ్య అభిప్రాయబేధాలేం లేవు. కాకపోతే పవన్, త్రివిక్రమ్ ను వదులుతాడా అనేదే ప్రశ్న. దీనికి 2 కారణాలున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంతో సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయడు. పవన్ కనుక ఈ ప్రాజెక్టు లేట్ చేస్తే, కచ్చితంగా ఆ ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడుతుంది. ఒకవేళ సినిమా అనుకున్న టైమ్ కు పూర్తయినప్పటికీ.. రాజకీయంగా, వ్యక్తిగతంగా త్రివిక్రమ్ తనకు అవసరమని పవన్ భావిస్తే అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ చేసేదేం లేదు. మరోవైపు తారక్-త్రివిక్రమ్ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.