ఈసారి కన్ను కీర్తిసురేష్ పై పడింది

ఓ హీరోయిన్ తెలుగులో క్లిక్ అయిందంటే చాలు ఆమెకు సంబంధించిన పరభాషా చిత్రాలన్నీ టాలీవుడ్ తెరపై క్యూ కడతాయి. గతంలో త్రిష నటించిన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవ్వడం చూశాం. తాజాగా నయనతార…

ఓ హీరోయిన్ తెలుగులో క్లిక్ అయిందంటే చాలు ఆమెకు సంబంధించిన పరభాషా చిత్రాలన్నీ టాలీవుడ్ తెరపై క్యూ కడతాయి. గతంలో త్రిష నటించిన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవ్వడం చూశాం. తాజాగా నయనతార నటిస్తున్న ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి కీర్తిసురేష్ కూడా చేరింది. కొంతమంది నిర్మాతలు కీర్తిసురేష్ సినిమాల్ని కొనడం ప్రారంభించారు.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. నేను లోకల్ సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ సక్సెస్ ల సంగతి పక్కనపెడితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తోంది. ఈ ఒక్క అంశం చాలు కీర్తిసురేష్ తెలుగులో పాపులర్ అయిపోవడానికి.

అందుకే ఆమె నటించిన తమిళ సినిమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుగు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే ఆమె నటించిన ఓ తమిళ సినిమా రెమో పేరుతో డబ్ అయింది. తాజాగా ఇప్పుడు మరో 2 తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమా డబ్బింగ్ రూపంలో టాలీవుడ్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి.