ఒక ఇమేజ్ అంటూ రావడమే కష్టం. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అవసరాల శ్రీనివాస్ అందించిన ఫ్యామిలీ కామెడీ సినిమాలు చూసి, జనం అబ్బో, మరో జంధ్యాల దొరికాడు అనుకున్నారు. అంత మంచి ఇమేజ్ వచ్చిన తరువాత దాన్ని అలా నిలబెట్టుకోవాలి. కానీ అవసరాల అలా ఊరుకోలేదు. బాబు బాగా బిజీ అనే సినిమా అంగీకరించాడు. నటుడిగానే కావచ్చు.
హంటర్ సినిమాకు రీమేక్ ఇది. ఆ సినిమా అసలే ఫక్తు సి సెంటర్ మళయాళీ సెక్స్ సినిమాలా వుంటుంది. దాన్ని తెలుగులోకి తెస్తున్నారు. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక నిమిషం నిడివి వున్న ఓ విడియో క్లిప్ వాట్సప్ లో తిరుగుతోంది. అది చూస్తే అవసరాలా? ఇది నీకు అవసరమా అని అనాలనిపిస్తోంది.
జాకెట్టు విప్పడం, చీర పైకి ఎత్తడం, పెదాలను లాలీపప్ లా జుర్రేయడం ఆ ఒక్క నిమిషంలోనే చూపించేసారు. మరింక మిగిలిన సినిమా ఎలా వుంటుందో? అవసరాల వున్నాడని సినిమాకు వస్తే ఓ తరహా ఆశాభంగం. లేదూ ఈ సినిమా చూసి భవిష్యత్ లో వచ్చే అవసరాల సినిమాలకు కాస్త దూరంగా వుంటే అదో సమస్య. అవసరమా ఇదంతా?