ఆ టైపు కావాలంటున్న నయనతార

తెలుగులో ఒకలా, తమిళ్ లో మరోలా క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకోవడం నయనతారకు అలవాటైన పనే. తెలుగులో స్టార్ హీరోల సరసన కమర్షియల్ హీరోయిన్ గా కనిపించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తమిళనాట మాత్రం…

తెలుగులో ఒకలా, తమిళ్ లో మరోలా క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకోవడం నయనతారకు అలవాటైన పనే. తెలుగులో స్టార్ హీరోల సరసన కమర్షియల్ హీరోయిన్ గా కనిపించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తమిళనాట మాత్రం ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను టాలీవుడ్ కు కూడా అనుసరించాలని చూస్తోందట.

2 బడా ఆఫర్లతో టాలీవుడ్ కు చెందిన మేకర్స్ కొందరు ఈమధ్య నయనతారను కలిశారు. వాటిని తిరస్కరించిన నయనతార.. ఫిమేల్ ఓరియంటెడ్ కథలతో తన వద్దకు రావాలని సూచించిందట. తమిళ్ లో తను చేస్తున్న కథల్ని వివరించిన ఆమె.. ఇలాంటి బలమైన పాత్రలు ఉంటేనే తన వద్దకు రావాలని క్లియర్ గా చెప్పేసిందట.

తెలుగులో నయనతార నటించిన డబ్బింగ్ సినిమాలేవీ ఆడలేదు. ఆ మధ్య వచ్చిన మయూరి అనే సినిమా మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. అది మినహాయిస్తే, తాజాగా వచ్చిన డోర సినిమాతో సహా అన్నీ ఫ్లాపులే.

టాలీవుడ్ లో నయన్ ను కేవలం గ్లామర్ హీరోయిన్ గానే చూస్తారు. మరీ ముఖ్యంగా తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి మేకర్స్ ఎవరూ పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి టైమ్ లో నయనతార పెడుతున్న కండిషన్లు, ఆమె కెరీక్ కే నష్టం కలిగిస్తాయి. టాలీవుడ్ ను లైట్ తీసుకుంది కాబట్టే, నయనతార ఇలాంటి కండిషన్లు పెడుతుందనేవాళ్లు కూడా ఉన్నారు.