చరణ్ సినిమాపై రోజుకో క్లారిటీ

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై వినిపిస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీపై రోజుకో రూమర్ హల్ చల్ చేస్తూనే ఉంది. అందుకే సినిమా యూనిట్ ఓవైపు షూటింగ్ చేస్తూనే,…

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై వినిపిస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీపై రోజుకో రూమర్ హల్ చల్ చేస్తూనే ఉంది. అందుకే సినిమా యూనిట్ ఓవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు ఈ పుకార్లపై స్పష్టత ఇస్తూ వస్తోంది. ఇప్పటికే వచ్చిన కొన్ని పుకార్లపై క్లారిటీ ఇచ్చిన సినిమా తాజాగా మరో వార్తపై కూడా వివరణ ఇచ్చింది. ఈసారి క్లారిటీ అనసూయపై వచ్చింది. 

చెర్రీ-సుకుమార్ సినిమాలో అనసూయ ఉందనే విషయాన్ని ఈమధ్యే పక్కా చేసింది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని కొందరు, ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ లో కనిపించనుందని మరికొందరు రాసుకొచ్చారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన యూనిట్.. సినిమా మొత్తం అనసూయ కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.  ఏ ఒక్క పాటకో, సీన్ కో పరిమితం కాదని స్పష్టంచేసింది.

చరణ్ సినిమాలో అనసూయది ఫుల్ లెంగ్త్ రోల్ అట. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఆమెది ప్రత్యేక పాత్రే. తాజాగా వచ్చిన విన్నర్ సినిమాలో కేవలం ఐటెంసాంగే. క్షణం సినిమాలో మాత్రం మంచి పాత్ర చేసింది. ఇప్పుడు చరణ్ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనిపించబోతోందట అనసూయ.