మహేష్ మూవీలో రకుల్ క్యారెక్టర్ ఇదే…?

ఫస్ట్ టైం మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఛాన్స్ రావడమే పెద్ద విషయం. అందుకే రెమ్యూనరేషన్, క్యారెక్టర్ గురించి పట్టించుకోని ఉండదు రకుల్ ప్రీత్ సింగ్. కానీ దర్శకుడు మురుగదాస్ మాత్రం ఆమెకు మంచి…

ఫస్ట్ టైం మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఛాన్స్ రావడమే పెద్ద విషయం. అందుకే రెమ్యూనరేషన్, క్యారెక్టర్ గురించి పట్టించుకోని ఉండదు రకుల్ ప్రీత్ సింగ్. కానీ దర్శకుడు మురుగదాస్ మాత్రం ఆమెకు మంచి పాత్రే ఇచ్చాడు. స్పైడర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుంది. తాజాగా ఈ విషయం బయటపడింది. 

మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సమాంతరంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాట వికటన్ అనే పత్రికకు మహేష్ బాబు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా ఆ ఇంటర్వ్యూ రేపు పత్రికలో రానుంది. ఆ ఇంటర్వ్యూలోనే రకుల్ క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ కూడా రేపు వికటన్ పత్రికలో రాబోతున్నాయి. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏప్రిల్ 15 నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. జూన్ 23న స్పైడర్ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.