నయనతారతో సినిమా చేయబోతున్న ధోనీ?

స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, కోలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. స్టార్ హీరోయిన్ నయనతారతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ధోనీ-నయన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రావడం లేదు. ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్టుకు…

స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, కోలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. స్టార్ హీరోయిన్ నయనతారతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ధోనీ-నయన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రావడం లేదు. ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు ధోనీ. అలా కోలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్ లో జోరుగా షికారు చేస్తున్న పుకారు ఇది.

సౌత్ సినిమాలో అడుగుపెట్టాలనే ఆలోచన ధోనీకి ఎప్పట్నుంచో ఉంది. దీనికి సంబంధించి రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్ తో ధోనీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడట. ఆయన సూచన మేరకు నయనతారతో సినిమా నిర్మించాలని అనుకుంటున్నాడట ఈ క్రికెటర్.

నయనతారతోనే సినిమా చేయాలనుకోవడం వెనక మరో రీజన్ కూడా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో షారూక్ ఖాన్ సరసన ఓ సినిమా చేస్తోంది నయన్. కాబట్టి ఆమెతో సినిమా చేస్తే, బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంటుందనే ఉద్దేశంలో ధోనీ ఉన్నాడు. పైగా ఈ ప్రాజెక్టులో అతిథి పాత్రలో ధోనీ కనిపిస్తాడట.

ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలోనే ఉంది. దర్శకుడు ఎవరనే విషయాన్ని బయటకు వెల్లడించలేదు. మరోవైపు ధోనీ కూడా ఈ రూమర్ పై స్పందించలేదు.

కోలీవుడ్ కు, క్రికెటర్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. గతంలో హర్భజన్ సింగ్ ఓ తమిళ సినిమాలో నటించాడు. రీసెంట్ గా కూడా ఫ్రెండ్ షిప్ అనే మూవీ చేశాడు. మరో క్రికెటర్ శ్రీశాంత్ కూడా తమిళ సినిమాతోనే నటుడిగా మారాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ అయితే ఏకంగా విక్రమ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.