రాజమౌళి ఇచ్చిన క్లారిటీ

తన తరువాతి సినిమా మీద దిగ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాస్త క్లారిటీ ఇచ్చారు. నిన్నటికి నిన్న చెన్నయ్ లో బాహుబలి 2 అడియో సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఓ ప్రశ్నకు…

తన తరువాతి సినిమా మీద దిగ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాస్త క్లారిటీ ఇచ్చారు. నిన్నటికి నిన్న చెన్నయ్ లో బాహుబలి 2 అడియో సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. తన తరువాతి సినిమాను విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా తీయాలనుకుంటున్నాని ఆయన వెల్లడించారు. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి కచ్చితంగా ఓ నార్మల్ సినిమా ఎంటెప్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నదే. ఇప్పుడు రాజమౌళి సమాధానం కూడా దాన్నే బలపరుస్తోంది.

గతంలో ఇలాగే సునీల్ హీరోగా మర్యాదరామన్న తీసారు రాజమౌళి. ఇప్పుడు మరి ఏ హీరోను ఎంచుకుని, మీడియం రేంజ్ సినిమా తీస్తారో చూడాలి. రాజమౌళి మీడియం రేంజ్ సినిమా అనుకుని అంటెప్ట్ చేసినా, ఆయనకు వున్న క్రేజ్ దృష్ట్యా అది బిజినిస్ విషయంలో మాత్రం భారీ రేంజ్ లోనే వుంటుంది.

రాజమౌళికి నాని అంటే చాలా అభిమానమని, ఈసారి హీరో నానితో ఓ మంచి సినిమా చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈగ సినిమాలో నాని జస్ట్ కొద్ది సేపే కనిపించారు. తన పాత్ర నిడివి అంతే అని తెలిసి కూడా నాని ఆ సినిమాను ఓకే చేసారు. ఆ తరువాత కూడా చాలా సందర్భాల్లో నాని-రాజమౌళి నడుమ బాండింగ్ బయటపడింది. ఆ మధ్య ఓ సినిమాలో నాని కోసమే రాజమౌళి స్క్రీన్ మీద కాస్సేపు కనిపించారు.

అందుకే ఈసారి నాని ఫుల్ లెంగ్త్ హీరోగా రాజమౌళి ఓ సినిమా చేయవచ్చని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.