కేశినేని పేరు వినగానే ట్రావెల్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ సంస్థ సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పార్లమెంట్ సభ్యుడు, కేశినేని సంస్థల అధినేత నాని సోదరుడు సంస్థ తరపున గత కొన్నేళ్లుగా సినిమా రంగంలో వున్నారు. పెద్దగా పెట్టుబడులు పెట్టకపోయినా, సరైన ప్రాజెక్టుల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోలకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అడ్వాన్స్ లు అందుకున్న వారిలో హీరో శర్వానంద్ కూడా వున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేశినేని నాని తన ట్రావెల్స్ బిజినెస్ కు స్వస్తి చెబుతున్నారు. నిన్నటికి నిన్న మొత్తం కేశినేని సంస్థల కార్యాలయాలు అన్నింటిని మూసేసారు. సిబ్బందిని తొలగించారు. బస్సులను 50 లక్షల వంతున విక్రయించేస్తున్నట్లు వార్తలు వినవచ్చాయి. ప్రయివేటు రవాణా రంగంలో ఇటీవల భారీ కుదుపులు తప్పలేదు. ముఖ్యంగా తెలంగాణ విభజన అనంతరం, అక్కడ కాస్త కఠినంగా వ్యవహారిస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రయివేటు ఆపరేటర్ల హవా నడవడం లేదు. దీంతో ప్రయివేటు ట్రావెల్స్ కు నష్టాలు తప్పడం లేదు. పైగా కాంపిటీషన్ పెరగడం, సరైన సిబ్బంది లభించకపోవడం, జీతాలు పెరగడం వంటి కారణాలతో నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఈ వ్యాపారం నుంచి కేశినేని తప్పుకుంటున్నారు.
ఇకపై సినిమా నిర్మాణ రంగంలో కేశినేని చురుగ్గా పాల్గొంటారని టాక్. అయితే హీరోల డేట్ లు దొరకాలి, ప్రాజెక్టులు సెట్ కావాలి. అందుకు కాస్త టైమ్ పడుతుంది