ఖైదీ నంబర్ 150లో ఐటెంసాంగ్ ఛాన్స్ మిస్ అయిన తర్వాత దాదాపు పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించడం మానేసింది క్యాథరీన్ థ్రెసా. ఒకే ఒక్కసారి ఓ షాప్ ఓపెనింగ్ కు వచ్చిన ఈ చిన్నది, ఇలా వచ్చి అలా మాయమైంది. మళ్లీ ఇన్ని రోజులకు కెమెరాకు చిక్కింది ఈ బ్యూటీ. అయితే ఈసారి సంథింగ్ స్పెషల్ గా కనిపించింది.
అవును.. క్యాథరీన్ ఇప్పుడు కాస్త సన్నబడింది. టాప్ టు బాటమ్ స్లిమ్ గా తయారైంది. రుద్రమదేవి, సరైనోడు సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించిన ఈ భామ ఇప్పుడు సన్నజాజి తీగలా ముస్తాబైంది. ఆమె నడుము ఇప్పుడు మరింత సన్నగా మారింది. బుగ్గలు తగ్గి ముఖం కోలగా తయారైంది.
ఈ నయా మేకోవర్ క్యాథరీన్ కు తెలుగులో ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ హీరోయిన్ రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి, గోపీచంద్ “గౌతమ్ నంద” సినిమాల్లో నటిస్తోంది.